1. పీఎం కిసాన్ పథకానికి (PM KISAN Scheme) చెందిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను న్యూ ఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 కార్యక్రమంలో రిలీజ్ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 8 కోట్లకు పైగా రైతుల అకౌంట్లలో రూ.16,000 కోట్లు విడుదల చేశారు. అక్టోబర్ 24 లోగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర ప్రభుత్వం మే చివరి వారంలో పీఎం కిసాన్ 11వ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతుల అకౌంట్లలో రూ.2,000 జమ కాలేదు. అలాంటి రైతుల్ని గుర్తించి వారి అకౌంట్లలో 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన రూ.2,000, 12వ ఇన్స్టాల్మెంట్ రూ.2,000 కలిపి మొత్తం రూ.4,000 జమ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఈసారి ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బుల్ని జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ డబ్బుల్ని పొందడానికి ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఇకేవైసీ పూర్తి చేయని రైతులకు 12వ ఇన్స్టాల్మెంట్ వచ్చే అవకాశం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ లో ఇకైవేసీ ప్రాసెస్ మళ్లీ ప్రారంభమైంది. కొన్నాళ్లు ఇకైవేసీ ఆప్షన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇకేవైసీ ప్రాసెస్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. రైతులు సులువుగా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. రైతులు ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది. ఇ-కేవైసీ చేయలేని రైతులు దగ్గర్లోని సీఎస్సీ సెంటర్లకు వెళ్లి బయోమెట్రిక్ బేస్డ్ ఇకైవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. అయితే ఆన్లైన్లో సింపుల్ స్టెప్స్‌తో ఇకేవైసీ పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)