పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు దీపావళి కన్నా ముందే రానున్నాయి. మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 17, 18 తేదీల్లో జరగనున్న అగ్రి స్టార్టప్ కాంక్లేవ్ అండ్ కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా రూ.2 వేల డబ్బులను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అలాగే మోదీ కొంత మంది రైతులతో మాట్లాడే అవకాశం ఉంది.