* కారు అద్దెకు తీసుకోవడం బెటర్ : సోలో ట్రిప్ కోసం అద్దె కారును తీసుకుంటే చాలా వరకు డబ్బును ఆదా చేయవచ్చు. పైగా ఇతరులపై ఆధారపడకుండా మీకు నచ్చినట్లు ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా షాపింగ్ కూడా చేయవచ్చు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రకృతితో మమేకం కావచ్చు. ప్రకృతి అందాలను సెల్ ఫోన్లలో బంధించవచ్చు.
* ముందస్తు ప్లాన్ : సోలో ట్రిప్‌కు సంబంధించి అన్ని విషయాలను ముందుగా తెలుసుకుంటే మంచిది. విజిట్ చేసే ప్రదేశాలు, ఫుడ్, రెస్ట్ తదితర అంశాలపై ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ట్రిప్ సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ట్రావెల్ సమయంలో ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ మంచి ఫుడ్ లభిస్తుంది, చూడదగ్గ ప్రదేశాలు వంటి వాటిపై అవగాహన ఉంటే సోల్ ట్రిప్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు.