PIB FACT CHECK TELLS FACTS ABOUT MODI GOVERNMENT 4000 ASSISTANCE FOR CORONAVIRUS TREATMENT NS
Fact Check: కరోనా చికిత్సకు కేంద్రం రూ. 4 వేల సాయం.. ఈ పథకంపై వాస్తవాలివే..
కరోనా చికిత్స చేయించుకున్న వారికి కేంద్రం రూ. 4 వేల సాయం అందిస్తోందని ఇటీవల వాట్సాప్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పథకానికి సంబంధించిన వాస్తవ వివరాలు ఇలా ఉన్నాయి.
సోషల్ మీడియాలో నిత్యం అనేక పథకాలపై ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంలో కొన్ని సార్లు అవస్తవాలు కూడా చేరి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి.
2/ 9
ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది కరోనా బాధితుల చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం రూ .4,000 ఆర్థిక సహాయం అందిస్తోందన్నది ఆ వార్త సారాంశం.
3/ 9
ఈ మెసేజ్ WhatsApp లో వైరల్ అవుతోంది. దీంతో వార్త వెనుక దాగి ఉన్న వాస్తవాలని PIB Fact Check బయట పెట్టింది.
4/ 9
తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది PIB Fact Check.
5/ 9
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అలాంటి ఏ పథకాన్ని తీసుకురాలేదని స్పష్టం చేసింది PIB Fact Check.
6/ 9
ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని PIB స్పష్టం చేసింది.
7/ 9
అటువంటి నకిలీ వార్తలను ఎదుర్కొన్న ఎవరైనా PIBFactCheck https: //factcheck.pib.gov.in/ లేదా WhatsApp +918799711259 లేదా ఇ-మెయిల్ pibfactcheck@gmail.com ని సంప్రదించాలని సూచించారు.
8/ 9
పూర్తి సమాచారం https://pib.gov.in PIB వెబ్సైట్లో లభిస్తుందని తెలిపింది.