1. గత కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 70 ఏళ్ల తర్వాత పెన్షన్ రావడం ఆగిపోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ప్రకటించింది ‘పీఐబీ ఫ్యాక్ట్‌చెక్’. రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 70 నుంచి 75 ఏళ్ల వయస్సు తర్వాత పెన్షన్ నిలిపివేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు బర్తమాన్ పత్రిక, babushahi.com వెబ్సైట్ తప్పుడు వార్తల్ని ప్రచురించినట్టు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ధృవీరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ రెండు మీడియా రిపోర్టులలో చేసిన వాదనలు ఫేక్ అని నిర్ధారించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ గానీ అటువంటి ప్రతిపాదనను చేయలేదు. లేదా అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఈ విషయాన్ని పీఐబీ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. "బర్తమాన్ పత్రిక, http://babushahi.com 70-75 సంవత్సరాల వయస్సు తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్‌ను నిలిపివేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని తప్పుగా నివేదించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ అటువంటి ప్రతిపాదనను చేయలేదు. అసలు ఈ విషయం గురించి ఆలోచించనే లేదు "అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) ట్వీట్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)