1. డిజిటల్ పేమెంట్స్ కంపెనీ అయిన ఫోన్‌పే (PhonePe) మరో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకువారికి యూపీఐ సిప్ (UPI SIP) ప్రకటించింది. ఫోన్‌పే యాప్ ద్వారా యూజర్లు 24 క్యారట్ బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతీ నెలా అంతే మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. మ్యూచువల్ ఫండ్‌లో (Mutual Fund) సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసినట్టుగా బంగారంలో సిప్ చేయొచ్చు. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి భారీ మొత్తంలో డబ్బులు అవసరం లేదు. కేవలం రూ.100 నుంచి పొదుపు ప్రారంభించవచ్చు. మీరు చెల్లించిన మొత్తానికి ఆ రోజు బంగారం ధర ప్రకారం ఎంత బంగారం వస్తుందో ఆ గోల్డ్ మీ వ్యాలెట్లోకి వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మీ పేరు మీద వచ్చే బంగారాన్ని బ్యాంక్ గ్రేడ్ లాకర్లలో భద్రపర్చుకోవచ్చు. ఈ లాకర్లను MMTC-PAMP, సేఫ్గోల్డ్ సంస్థలు నిర్వహిస్తాయి. ప్రతీ నెలా గుర్తుపెట్టుకొని డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. యూపీఐ ద్వారా ఆటోమెటిక్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం మీరు కేవలం యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ప్రాసెస్ సెట్ చేస్తే ప్రతీ నెలా ఆటోమెటిక్‌గా మీరు సూచించిన మొత్తం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. బంగారం కొనడమే కాదు... అమ్మడం కూడా సులువే. మీరు జమ చేసిన మొత్తం బంగారాన్ని నిమిషాల్లో అమ్మేయొచ్చు. డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. లేదా మీరు జమ చేసిన బంగారాన్ని గోల్డ్ కాయిన్స్ లేదా గోల్డ్ బిస్కెట్స్ రూపంలో మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో బంగారం కొనలేనివారికి ఇది పొదుపు పథకంలా ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. యూజర్లు ప్రతీ నెలా రూ.100 నుంచి ఎంత మొత్తం అయినా 24 క్యారట్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం, పెళ్లిళ్లు ఫంక్షన్ల కోసం ఇలా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అవసరం వచ్చినప్పుడు బంగారం అమ్మి ఆ డబ్బుతో నగలు కొనొచ్చు. దీని వల్ల భవిష్యత్తులో బంగారం ధర భారీగా పెరిగినా ముందు నుంచే పొదుపు చేస్తుంటారు కాబట్టి యావరేజ్ ధరకే గోల్డ్ సొంతం అవుతుంది. మరి ఫోన్‌పే యాప్‌లో గోల్డ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముందుగా ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్‌లో Wealth పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత గోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ప్రొవైడర్ పేరు సెలెక్ట్ చేయండి. ప్రతీ నెలా ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. ఏ తేదీన డబ్బులు చెల్లించాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. ఆ తర్వాత Pay and set Autopay ఆప్షన్ ఎంచుకోండి. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ప్రతీ నెలా మీరు సూచించిన తేదీన మీరు ఎంటర్ చేసిన మొత్తం మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఆ మొత్తానికి ఎంత బంగారం వస్తుందో ఆ గోల్డ్ మీ వ్యాలెట్‌లో యాడ్ అవుతుంది. డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసేముందు రీడీమ్ చేసేప్పుడు, గోల్డ్ కాయిన్, గోల్డ్ బిస్కిట్గా మార్చుకున్నప్పుడు వసూలు చేసే ఛార్జీల గురించి తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)