1. అక్టోబర్ 23న ధన్తేరస్ (ధన త్రయోదశి) జరుపుకోనున్నారు. ఈ రోజున ధన్వంతరి, కుబేరుడు, లక్ష్మీని పూజిస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం ధన్తేరస్ (Dhanteras) రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజున బంగారం, వెండి లేదా కొత్త పాత్రలను కొంటే ఇంటికి అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఫిజికల్ గోల్డ్‌లోనే కాకుండా పేపర్, డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్‌లో కస్టమర్లు 99.99 శాతం స్వచ్ఛమైన 24-క్యారెట్ బంగారం లభిస్తుంది. కొనుగోలు చేసిన బంగారం సర్వీస్ ప్రొవైడర్ వాల్ట్‌లో స్టోర్ చేస్తారు. కస్టమర్ కోరుకున్నప్పుడు డోర్‌స్టెప్ డెలివరీ చేస్తారు. డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయడానికి విశ్వసనీయ యాప్‌లు, వెబ్సైట్లు ఇవే.. (ప్రతీకాత్మక చిత్రం)
4. Tanishq: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల వ్యాపార సంస్థ అయిన తనిష్క్ తన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ గోల్డ్ కొనుగోలు సేవలను అందిస్తోంది. కస్టమర్లు టాటా, సేఫ్గోల్డ్ ట్రస్ట్‌తో 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు తమ డిజిటల్ బంగారాన్ని ఏ సమయంలోనైనా Tanishq.co.inలో లేదా 350+ తనిష్క్ స్టోర్లలో ఆభరణాలుగా మార్చుకోవడానికి ప్రత్యేకమైన ఆప్షన్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. SafeGold: సేఫ్ గోల్డ్ అనేది 24K ఫిజికల్ గోల్డ్‌ని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి, డెలివరీ చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్. SafeGold సున్నా ఖర్చుతో ఫిజికల్ డెలివరీ, స్టోరేజీ సేవలను అందిస్తుంది. ప్లాట్‌ఫారమ్‌పై కొనుగోలు చేసిన డిజిటల్ బంగారం రక్షిత BRINKS వాల్ట్‌లో స్టోర్ చేస్తారు. SEBI-రెగ్యులేటెడ్ ట్రస్టీ నియంత్రణలో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. 5Paisa: 5పైసా అనే ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం డిజిటల్ బంగారంతో సహా అన్ని రకాల ఆర్థిక ట్రాన్సాక్షన్లకు సపోర్ట్ చేస్తుంది. 5పైసా ఇన్వెస్ట్ 99.99 శాతం స్వచ్ఛతతో 24 క్యారెట్ బంగారాన్ని అందిస్తుంది. ఇది గోల్డ్ వాల్ట్ సేవను కూడా కల్పిస్తుంది. 5Paisa ఫారమ్ అస్సే సర్టిఫైడ్ నాణేలలో డెలివరీ చేయడానికి ఛార్జీలు వసూలు చేస్తుంది. ఛార్జ్ మింటింగ్, ప్యాకేజింగ్, బీమా, అస్సే సర్టిఫికేషన్, డెలివరీ ఖర్చులను కవర్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. Paytm: పేటీఎం అనేది డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తున్న ప్రసిద్ధ ఫిన్‌టెక్ యాప్. ట్రాన్సాక్షన్ పూర్తి చేస్తున్నప్పుడు యాప్ బంగారం లైవ్ రేట్‌ను చూపుతుంది. కస్టమర్లు Paytm గోల్డ్ విభాగంలోని లాకర్ చిహ్నంకి వెళ్లి కొనుగోలు చేసిన బంగారం మొత్తాన్ని ట్రాక్ చేయవచ్చు. Paytmలో బంగారాన్ని ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకునేందుకు మేకింగ్ , డెలివరీ ఛార్జీలు కస్టమర్లు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. PhonePe: ఫోన్ పే స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వేదికగా మారింది. ప్లాట్‌ఫారమ్ 99.99 శాతం స్వచ్ఛమైన బంగారం, సేఫ్ గోల్డ్ 99.50 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని అందించడానికి MMTC-PAMPతో కలిసి పని చేస్తోంది. PhonePe యాప్‌లో ప్రతి 5 నిమిషాలకు బంగారం ధరలు అప్డేట్ అవుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)