యూపీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే ప్రకటించింది. ఈ కొత్త సర్వీసుల్లో భాగంగా ఫోన్‌పే యూజర్లు ఇకపై విదేశీ మర్చంట్లకు చెల్లింపులు చేయొచ్చని వెల్లడించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సేవలు లభిస్తాయని వివరించింది.