Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా ?.. ఆయిల్ కంపెనీలకు కేంద్రమంత్రి కీలక సూచన
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా ?.. ఆయిల్ కంపెనీలకు కేంద్రమంత్రి కీలక సూచన
Petrol-Diesel: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ చమురు కంపెనీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాయని, చిల్లర ధరలను పెంచలేదని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇంధన ధరలను తగ్గించాలని చమురు కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు అదుపులో ఉండి కంపెనీల అండర్ రికవరీ ఆగిపోయినట్లయితే, దేశంలో చమురు ధరలను తగ్గించాలని చమురు కంపెనీలకు సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ తాము చమురు ధరలను నిర్వహించగలిగామని ఆయన అన్నారు. నవంబర్ 2021 మరియు మే 2022లో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయినప్పటికీ VATని తగ్గించలేదని... దీనివల్ల అక్కడ చమురు ధర ఇంకా ఎక్కువగానే ఉందని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో కంపెనీలపై ఒత్తిడి తగ్గినప్పటికీ, గత నష్టాలను పూడ్చేందుకు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి కోత విధించలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఆయిల్ కంపెనీలు నష్టాలు నుంచి కోలుకున్నాక ధరలు తగ్గుతాయని భావిస్తున్నానని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ చమురు కంపెనీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాయని, చిల్లర ధరలను పెంచలేదని వ్యాఖ్యానించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ధరలను స్థిరంగా ఉంచడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఈ కంపెనీలు మొత్తం రూ. 21,201.18 కోట్ల నష్టాన్ని చవిచూశాయని పూరీ చెప్పారు. ఈ నష్టాన్ని ఇంకా భర్తీ చేయలేదన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)