1. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సెంచరీకి చేరువలుతున్నాయి. కరోనా కాలంలో కొన్నాళ్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా పెరగలేదు. కానీ ఇప్పుడు ఆయిల్ కంపెనీలు మళ్లీ విజృంభిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. దీంతో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ముంబైలో పెట్రోల్ ధర రూ.91 దాటింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌ను రూ.91.07 ధరకు అమ్ముతున్నారు. అంటే సెంచరీకి చేరువవుతున్నట్టే. ఇంకో రూ.9 పెరిగితే చాలు... లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.45. ఢిల్లీ చరిత్రలోనే ఇదే గరిష్ట ధర. ఇప్పటివరకు ఇంత ధర ఎప్పుడూ లేదు. ఇక ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.74.63. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. మరోవైపు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.85 కాగా లీటర్ డీజిల్ ధర రూ.81.45. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.87.30 కాగా లీటర్ డీజిల్ ధర రూ.79.14. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. గత ఐదు రోజులు సైలెంట్‌గా ఉన్న ఆయిల్ కంపెనీలు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచడం విశేషం. దీంతో రికార్డ్ ధరలకు చేరుకుంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-BPCL, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL కంపెనీలు అంతర్జాతీయ ధరల ఆధారంగా పెట్రోల్ డీజిల్ ధరల్ని సవరిస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)