ప్రజలు ఎంత గగ్గోలు పెడుతున్నా ఇంధన ధరలు మాత్రం తగ్గడం లేదు. పెట్రోల్ రూ.120 దిశగా పరుగులు పెడుతోంది. ఇవాళ మరోసారి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్ 38 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.82కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.103.94గా ఉంది..(ప్రతీకాత్మకచిత్రం)
మనదేశంలో పెట్రోల్ రేటు అత్యధికంగా రాజస్థాన్లోని గంగానగర్లో ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉంది. నిన్నటిలో పోల్చితే ఇవాళ 24 పైసలు తగ్గడం విశేషం. డీజిల్ కూడా 18 పైసలు దిగొచ్చింది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.108.85గా ఉంది. త్వరలోనే ఇక్కడ లీటర్ పెట్రోల్ 120కి చేరే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)