వాహనదారులకు అలర్ట్. ఇవాళ బండ్లు తీసుకొని రోడ్లపైకి వచ్చే ముందు నిల్వను చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే దాదాపు దేశవ్యాప్తంగా ఇవాళ పెట్రోల్ బంకులకు సరఫరా ఉండదు. ఆయిల్ కంపెనీల తీరును నిరసిస్తూ ఇంధన డీలర్లు నేడు కొనుగోళ్లను నిలిపేశారు. అందుబాటులో ఉన్న స్టాకును మాత్రమే ఇవాళ విక్రయిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఇంధన కంపెనీలు తాజాగా (మంగళవారం) ప్రకటన చేశాయి. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పరిస్థితులను అదుపు చేసే దిశగా ఇటీవల పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం తెలిసిందే. ఏప్రిల్ తర్వాత మళ్లీ రేట్ల పెంపు జరగలేదు. అయితే, ఆయా నగరాలను బట్టి ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కమీషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ, తెలంగాణ సహా 24 రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల డీలర్లు ఇవాళ ఆయిల్ కంపెనీల నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపేశారు. దీంతో 24 రాష్ట్రాల్లోని 70,000 అవుట్లెట్లు చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేయవు. తద్వారా బంకులకు సరఫరా లేక ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం )
డీలర్ల మార్జిన్లను ప్రతి ఆరు నెలలకోసారి సవరిస్తామని ఓఎంసీలు, డీలర్ల సంఘం మధ్య ఒప్పందం కుదిరిందని.. అయితే 2017 నుంచి ఇది జరగడం లేదని డీలర్ల సంఘం పేర్కొంది. 2017 నుంచి దాదాపు రెట్టింపు అయ్యాయని.. అందువల్ల వ్యాపారంలో వర్కింగ్ క్యాపిటల్ కూడా రెట్టింపు అయ్యిందని డీలర్ల సంఘం వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం )