డీజిల్ ధర, లేటెస్ట్ పెట్రోల్, లేటెస్ట్ డీజిల్ ధర, ఎక్సైజ్ డ్యూటీ" width="875" height="583" /> ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరడంతో దిద్దుబాటు చర్యగా కేంద్రం గత వారం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం, పలు రాష్ట్రాలూ తమ వ్యాట్ లో కోతలు విధించడం తెలిసిందే. అయినాకూడా ఈ ఏడాది మార్చి స్థాయిలోనే అత్యధికంగానే కొనసాగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆయిల్ కంపెనీలు మంగళవారం నాడు తాజా ప్రకటన చేశాయి. అయితే ధరల పెంపు జోలికి మాత్రం పోలేదు. తద్వారా మధ్యలో భారీ తగ్గింపు కలుపుకొని దాదాపు 50రోజులుగా పెట్రోల్, డీజిల్ రేట్లలో పెరుగుదల లేదు. అయితే, ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు మాత్రం ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రభుత్వం స్థానికంగా వ్యాట్ తగ్గించని కారణంగా ఇంధన ధరలు పైపైనే ఉన్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.66గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.97.82 గా ఉంది. వరంగల్లో పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి లీటరు రూ.109.35 గా, డీజిల్ పై 17 పైసలు తగ్గి లీటరు రూ.97.52గా ఉంది. లో అత్యధికంగా పెట్రోల్ రూ.111.49గా, డీజిల్ రూ.99.52గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆంధ్రప్రదేశ్ లోనూ వ్యాట్ తగ్గించని కారణంగా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. విజయవాడలో ఇవాళ (శుక్రవారం) పెట్రోల్ ధర 31 పైసలు తగ్గి లీటరు రూ.111.76 గా, డీజిల్ పై 29 పైసలు తగ్గి లీటరు రూ.99.51 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర ఏకంగా 96 పైసలు పెరిగి లీటరు రూ.111.44 గా, డీజిల్ పై 89పైసలు పెరిగి లీటరు రూ.99.16గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఇంకాస్త పెరిగాయి. శుక్రవారం నాటికి ముడి బ్రెంట్ క్రూడ్ ధర 115 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 111 డాలర్లుగా ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధ సంక్షోభం, పలు దేశాల్లో ద్రవ్యోల్బణం కారణంగా ఇంధన ధరలు కొద్ది నెలలుగా అధికంగా ఉండటం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)