PETROL DIESEL PRICES TODAY 27TH JUNE 2022 FUEL PRICES REMAIN STEADY BUT CRUDE OIL DECREASED CHECK RATES IN YOUR CITY MKS
Petrol Diesel Price : తగ్గిన ముడి చమురు ధర -దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..
అంతర్జాతీయ మార్కెట్ లో కొద్దిరోజులుగా మండుతోన్న ముడి చమురు ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. కాగా, దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే పలు నగరాల్లో రేట్లు స్వల్పంగా పెరిగాయి..
పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆయిల్ కంపెనీలు సోమవారం (జూన్ 27)నాడు చేసిన ప్రకటనలో రేట్లు పెంచలేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రో ధరలు పెరగ్గా, మే 21న కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ధర కొద్దిగా దిగొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
హైదరాబాద్లో సోమవారం పెట్రోల్ రేటు లీటరుకు రూ.109.66గా, డీజిల్ రేటు రూ.97.82 గా కొనసాగుతోంది. నిజామాబాద్ లో మాత్రం పెట్రోల్ ధర 34 పైసలు పెరిగి లీటరు రూ.111.49గా, డీజిల్ పైనా 32 పైసలు పెరిగి లీటరు రూ.99.52గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఏపీ విజయవాడలో పెట్రోల్ ధర 17 పైసలు పెరిగి లీటరు రూ.112.09కి చేరింది. డీజిల్ పైనా 16 పైసలు పెరిగి లీటరు రూ.99.65గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటరు రూ.110.48గా, డీజిల్ లీటరు రూ. 98.27గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
చెన్నైలో పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.101.94గా, డీజిల్ రేటు రూ.87.89గా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ రేటు 1.4 శాతం తగ్గి బ్యారెల్ ధర 106.08 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ధర 1.3 శాతం తగ్గి బ్యారెల్ రేటు 111.70 డాలర్లుగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
రష్యా చమురు ఎగుమతులు, ఇరాన్ అణు ఒప్పందం పునరుద్ధరణ, G7 దేశాల సదస్సు తదితర అంశాల నేపథ్యంలోనే ముడి చమురు ధరలు సోమవారం బ్యారెల్కు $1 కంటే ఎక్కువ పడిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)