డీజిల్ ధరలు, పెట్రోల్ ధరల తగ్గింపు, డీజిల్ ధరల తగ్గింపు, పెట్రోల్ డీజిల్ లేటెస్ట్ న్యూస్" width="1600" height="1600" /> మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన ఇండియాలో సంక్షోభాలు తలెత్తే అవకాశాలు తక్కువే అయినా, కరోనా అనంతర కాలంలో అంచనాలన్నీ తారుమారై పరిస్థితి జఠిలంగా మారింది. పొరుగుదేశాలు శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ లో ఇంధన ధరలు, నిత్యావసరాలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెరిగి సంక్షోభానికి దారితీయగా, వాటితో పోల్చుకుంటే అతిపెద్ద వ్యవస్థ అయిన భారత్ ఆలస్యంగానైనా ధరల కట్టడి చర్యలకు దిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో పెట్రోల్, డీజిల్ పై కేంద్రం వసూలు చేస్తోన్న ఎక్సైజ్ టాక్సును తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి శనివారం నాడు ప్రకటన చేశారు. లీటరు పెట్రోలుపై రూ.8, లీటరు డీజిల్ పై రూ.6 సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో ఆయా రాష్ట్రాల్లో ఆదివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మొత్తంగా పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింది. అయితే, ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
నిజానికి ఇంధన ధరల పెంపు లేదా తగ్గింపు నిర్ణయాధికారాన్ని కేంద్రం చాలా ఏళ్ల కిందటే ఆయిల్ కంపెనీలకు కట్టబెట్టింది. గతంలో రెండు వారాలకు ఒకసారి, తర్వాత వారానికి ఒకసారి ధరలను సవరిస్తూ వచ్చిన కంపెనీలు గడిచిన రెండేళ్లుగా మాత్రం ప్రతిరోజూ సవరణలు ప్రకటిస్తుండటం తెలిసిందే. ఆదివారం వెలువడిన ప్రకటనలో స్థూలంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గినా, అదంతా కేంద్రం టాక్సుల తగ్గింపువల్లే. (ప్రతీకాత్మక చిత్రం)
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 నుంచి రూ.96.72కు, డీజిల్ రూ.96.67 నుంచి రూ.89.62కు పడిపోయింది. ముంబైలో పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.102.65, డీజిల్ రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89గా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.97.81, డీజిల్ రూ.90.05గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందనంపై పన్నులు తగ్గించిన కేంద్రం.. అదేపనిని రాష్ట్రాలూ చేయాలని కోరింది. అయితే బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇప్పటిదాకా కేరళ ఒక్కటే తగ్గింపు ప్రకటించింది. పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 తగ్గిస్తూ విజయన్ సర్కారు శనివారం ప్రకటన చేసింది. పెట్రో ధరల విషయంలో కేంద్రాన్ని తిట్టిపోస్తోన్న బీజేపీయేతర సీఎంలు త్వరలోనే ధరలు తగ్గించవచ్చని తెలుస్తోంది. అయితే తెలంగాణ, ఏపీల్లోనూ ధరల తగ్గింపు ఉంటుందా? అనేది అనుమానమే. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ పెట్రోల్ రేట్, పెట్రోల్ డీజిల్ ధరలు, పెట్రోల్ రేట్" width="1600" height="1600" /> పెట్రోల్/డీజిల్‌పై సుంకాన్ని కేంద్రం ఆరేడేళ్ల కిందటి స్థాయికి తీసుకురావాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. తద్వారా తాము రేట్లు తగ్గించేది లేదని ఆయన పరోక్షంగా చెప్పారు. రెండు నెలల క్రితం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.18.42, డీజిల్‌పై రూ.18.24 పెంచారు. ఇప్పుడు రూ.8, రూ.6 తగ్గించారు. భారీగా పెంచి.. స్వల్పంగా తగ్గించడం సరికాదు అని ఠాక్రే అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంధన ధరల తగ్గింపుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వెలువడింది. చాలా మంది పెంచింది కొండంత, తగ్గించిది గోరంత అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సైతం అదే మాట చెప్పారు. 2014లో ఎక్సైజ్ సుంకం లీటరు పెట్రోల్‌పై రూ.9.48, డీజిల్‌పై రూ.3.56 ఉందని, ఇప్పుడు పెట్రోల్‌పై రూ.19.90, డీజిల్‌పై రూ.15.80 ఎక్సైజ్ సుంకం ఉందని కాంగ్రెస్ అంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్రోల్, డీజిల్ తోపాటు వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ ఇస్తున్నట్టు కేంద్రం శనివారం నాడు ప్రకటించింది. అయితే, ఇది ప్రధాన్‌మంత్రి ఉజ్వల్ కల్యాణ్ యోజన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సబ్సిడీని వినియోగదారుల ఖాతాలో నేరుగా జమచేస్తారు. దేశంలో దాదాపు 30 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఉజ్వల్ పథకం లబ్ధిదారులుగా ఉన్న 10 కోట్లమందికి మాత్రమే తగ్గింపు వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రాజకీయాల సంగతి ఎలా ఉన్నా, దేశంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాలు దాటేసి దాదాపు 7.6 శాతానికి చేరిన దరిమిలా ధరలను పూర్తిగా నియంత్రించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని కేంద్రం ఇప్పటికే తగ్గించినా అది ఊరటనిచ్చే అవకాశాలు స్వల్పమే కావడంతో మరోసారి రేట్లు తగ్గుతాయనే అంచనాలున్నాయి. అయితే ఈసారి కేంద్రం పన్నులను తగ్గించుకుంటుందా? ఆయిల్ కంపెనీలు లాభాలను తగ్గించుకుంటాయా? అనేది తేలాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)