ఇండియాలో ప్రభుత్వ లేదా ప్రైవేటు రిఫైనరీలు ఉత్పత్తి చేస్తోన్న ముడి చమురును ఇకపై ప్రభుత్వ నిర్దేశంలో కాకుండా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే దేశీయంగా ఉత్పత్తి చేసే చమురు ఎగుమతులపై ఉన్న నిషేధం మాత్రం యథాతథంగా కొనసాగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్రం తాజా నిర్ణయం వల్ల దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి చేసే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత కంపెనీలకు మేలు జరగనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేసే చమురును కంపెనీలు ప్రభుత్వం నిర్ణయించిన కంపెనీలకు, అది కూడా నిర్ణీత పరిమాణంలో మాత్రమే అమ్మాల్సివస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)