కరోనా విలయం, లాక్ డౌన్ల కారణంగా గతేడాది (2021లో) దేశంలో ఇంధన డిమాండ్ దాదాపు అడుగంటడం తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ఇంధన వినియోగం క్రమంగా పెరుగుతూ వచ్చినా, ఈ ఏడాది (2022) ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఇంధన డిమాండ్ మళ్లీ పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇంధన డిమాండ్(గతేడాదితో పోల్చితే) ఏకంగా 10 శాతం పడిపోయింది. అయితే, తాజాగా విడుదలైన డేటా ప్రకారం 2022 మే నెలలో ఇంధన డిమాండ్ (గతేడాదితో పోల్చతే) 24 శాతం పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
భారత్ లో ఇంధన డిమాండ్ (2021మేతో పోల్చితే) ఈ మే నెలలో 24 శాతం పెరిగింది. అయితే, కిందటి నెల (2022 ఏప్రిల్)తో పోల్చుకుంటే మాత్రం ఇంధన డిమాండ్ పెరుగుదల కేవలం 0.4శాతమే కావడం గమనార్హం. 2021 మే నెలలో డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల 2022 మేలో పెరుగుదల 24 శాతం భారీగా కనిపిస్తోందని, అయితే, నెలవారీ పెరుగుదల (0.4శాతం) ఆశ్చర్యకరమే అని నిపుణులు అభిప్రాయపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ పెట్రోల్ రేట్, పెట్రోల్ డీజిల్ ధరలు, పెట్రోల్ ధర, పెట్రోల్ రేట్" width="875" height="583" /> రాబోయే కొద్ది నెలల్లో అధిక ధరల ప్రభావం ఇంధన వినియోగంపై ప్రభావం చూపుతుందని, వాహనదారులకు షాకింగ్ లేదా బ్యాడ్ న్యూస్ తప్పవనీ విశ్లేషకులు అంటున్నారు. అదీగాక భారత్ కొనుగోలుచేసే ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా పెరగడం, ఆయిల్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతుండటం లాంటి అంశాలు ఏ క్షణమైనా బద్దలై సామాన్యుడిపై బాదుడుకు దారి తీయొచ్చని అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
మే నెలలో డీజిల్ వినియోగం 31.7% పెరిగి 7.29 మిలియన్ టన్నులకు చేరుకుంది. రెండేళ్ల క్రితం కంటే దాదాపు 32.6% పెరిగింది. అదే పెట్రోల్ ఇంకా గ్యాసోలిన్ అమ్మకాలు అంతకు ముందు సంవత్సరం కంటే 51.5% పెరిగి 3.02 మిలియన్ టన్నులుగా ఉన్నాయని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ డేటాలో కేంద్రం పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఏప్రిల్, మే నెలల్లో ఇంధన ఢిమాండ్ ఆశించిన మేర లేకపోవడం, విక్రయాలు తగ్గడం వ్యతిరేక పరిణామాలుగా ఉండగా, రాబోయే కాలంలో పరిస్థితులు మెరుగుపడొచ్చనే అంచనాలున్నాయి. రాయిటర్స్ పోల్ ప్రకారం భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మేలో పడిపోయే అవకాశం ఉంది, అయితే ఇంధన పన్ను తగ్గింపు కారణంగా పెరుగుతున్న ఆహార ఖర్చులు ఇంధన ధరలలో తగ్గుదలని భర్తీ చేయడం వల్ల వరుసగా ఐదవ నెలలో సెంట్రల్ బ్యాంక్ ఎగువ సహన పరిమితి కంటే ఎక్కువగానే ఉండవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. మన దేశం కొనుగోలు చేసే బ్యారల్ చమురు (ఇండియన్ బాస్కెట్) సగటు ధర పదేళ్ల గరిష్ఠ స్థాయి 121.28 డాలర్లకు చేరింది. శుక్రవారం ఒక దశలో ఇది 122.80 డాలర్లకు చేరినా తర్వాత కొద్దిగా దిగొచ్చింది. ఈ అంశంపైనా పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) వివరాలు వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, వంట నూనెల ధరల తగ్గింపు, సిమెంట్ ధరల తగ్గింపు" width="1600" height="1600" /> ఈ ఏడాది ఫిబ్రవరి 25-మార్చి 29 మధ్య ఇది 111.86 డాలర్లు, మార్చి 30-ఏప్రిల్ 27 మధ్య 103.44 డాలర్ల వద్ద ఉంది. రష్యాపై ఆంక్షలు, ఒపెక్ దేశాల నుంచి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో గత నెల రెండో వారం నుంచి ముడి చమురు ధర సెగలు కక్కుతోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి ధరలు పెంచకుండా యథాతథ స్థితిని కొనసాగి స్తున్నాయి. లీటరు పెట్రోల్‌పై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.21 నష్టం వస్తున్నా ఓఎంసీలు ధరలు పెంచడం లేదు. ప్రభుత్వ పరోక్ష ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణం. (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో ద్రవ్యోల్బణ భయం కారణంగానే దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఏ మాత్రం సాహసించడం లేదు. అలా పెంచితే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కోరలు చాస్తుంది కాబట్టే ఆయిల్ కంపెనీలు ధరల పెంచకుండా కేంద్రం కట్టడి చేస్తున్నది. ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటటికే ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
భారీగా పెరుగుతోన్న అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా, దేశీయ మార్కెట్లో ఆయిల్ కంపెనీలు పెట్రో ధరలు పెంచితే రిటైల్ ద్రవ్యోల్బణం తొమ్మిది శాతానికి ఎగబాకుతుందనే అంచనాలున్నాయి. సదరు పరిణామాలు తలెత్తకుండా కేంద్రం ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. కానీ పెట్రోల్, డీజిల్‌పై నష్టాలను ఆయిల్ కంపెనీలు ఎంత కాలం భరించగలవన్నదే ప్రధానంగా మారింది. ఈ క్రమంలో వినియోగదారులపై బాదుడు తప్పదనే అంచనాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
భారత్ కొనుగోలు చేసే క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయిల్ కంపెనీలు శనివారం విడుదల చేసిన తాజా ప్రకటనలోనూ ధరల పెంపు జోలికి పోలేదు. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరు రూ.109.66గా, రూ.97.82గా ఉన్నాయి. అయితే గుంటూరులో డీజిల్ రేటు 11 పైసలు పెరిగి లీటరు రూ.99.53గా, పెట్రోల్ పై 12 పైసలు పెరిగి లీటరు రూ.111.81గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)