దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.101.94గా, డీజిల్ రేటు రూ.87.89గా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
దాదాపు మూడున్నర నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని కారణంగా దేశంలోనే అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు భారీ నష్టాలు వచ్చాయి. జూన్‌తో ముగిసిన క్వార్టర్లో ఐఓసీఎల్ కన్సాలిడేటెడ్ బేసిస్‌లో రూ.1,992 కోట్ల నష్టాన్ని సంస్థ రిపోర్టు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)