దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.101.94గా, డీజిల్ రేటు రూ.87.89గా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఉక్రెయిన్ పై యుద్దం కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా.. యూరప్ దేశాలకు రోజువారీగా సరఫరా చేసే గ్యాస్ లో కోత విధించింది. ఈ దెబ్బకు ఆయిల్ ధరలు పెరిగాయి. నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ ద్వారా యూరప్ దేశాలకు రష్యా సరఫరా చేస్తోన్న గ్యాస్ పరిమాణాన్ని 33 మిలియన్ క్యూబిక్ మీటర్లకు తగ్గించింది. ఇదిలా కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధర ఇంకాస్త పెరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)