జులై తొలి అర్ధ భాగంలో దేశంలో ఇంధన అమ్మకాలు క్షీణించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ విడుదల చేసిన రిపోర్టులో వెల్లడైంది. వర్షాకాలం సీజన్ ఊపందుకోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. పెట్రోల్ కంటే డీజిల్ అమ్మకాలు భారీగా, 14 శాతం మేరకు పడిపోయాయి. గడిచిన మూడు నెలల్లో ఇంధనం అమ్మకాల్లో తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసారి. ఏవియేషన్ ఫ్యూయెల్ డిమాండ్ కూడా 6.7 శాతం తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్లో మంగళవారం పెట్రోల్ రేటు లీటరుకు రూ.109.66గా, డీజిల్ రేటు రూ.97.82 గా స్థిరంగా కొనసాగుతున్నాయి. వరంగల్ లో పెట్రోల్ లీటరు రూ.109.16గా, డీజిల్ రూ.97.98గా ఉంది. ఉంది. తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ ధరలు పెద్దగా మారలేదు. ఏపీ విజయవాడలో పెట్రోల్ రేటు రూ.112.09గా ఉంది. డీజిల్ ధర లీటరు రూ.99.81 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటరు రూ.110.48గా, డీజిల్ ధర రూ.98.27గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.101.94గా, డీజిల్ రేటు రూ.87.89గా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం మార్కెట్లు తెరుచుకునే సమయానికి బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.06 శాతం పెరిగి ఒక బ్యారెల్ 106.33 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ క్రూడ్ రేటు 0.24 శాతం ఎగబాకి బ్యారెల్ 102.81 డాలర్లు అయింది. గత వారం రోజులుగా ఇది 100 డాలర్ల లోపే ఉండటం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
క్రూడాయిల్ ధరలు మారుతున్నా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి కారణం ప్రభుత్వ రంగ చమురు సంస్థల భారీ నష్టాలేనని తెలుస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) కలిపి రూ.10,700 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)