దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.101.94గా, డీజిల్ రేటు రూ.87.89గా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ రేటు 0.35 శాతం తగ్గి, బ్యారెల్కు 100.8 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ రేటు 0.72 శాతం తగ్గి, బ్యారెల్ 93.91 డాలర్లుగా ఉంది. తద్వారా గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు గత ఆరు రోజుల్లో దాదాపు 6శాతం మేర పడిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)
క్రూడాయిల్ ధరలు బ్యారల్ 100 డాలర్ల కిందకి పడిపోయినా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పుడిప్పుడే తగ్గించకపోవచ్చని అంచనాలున్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థల భారీ నష్టాలే ఇందుకు కారణం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) కలిపి రూ.10,700 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడంతో ఈ సంస్థల రిఫైనింగ్ మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఆయా సంస్థల మార్కెటింగ్ విభాగాలు మాత్రం నష్టాలు మూటగట్టుకున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకోడానికి కంపెనీలు ధరలు పెంచితే అది ప్రజలకు భారం కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)