గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం పెట్రోల్‌పై రూ.5 తగ్గించింది.
ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 28, 2021 నాటి ధరల ప్రకారం 85.65 డాలర్ల వద్ద ఉంది. ప్రస్తుతం ఈ ధరలతో సంబంధం లేకుండా ద్రవ్యోల్బం కట్టడి చేసేందుకు ప్రభుత్వం పెట్రోల్ రేట్లను తగ్గించిందనే వాదన వినిపిస్తుంది. ఏదైమైనా సామన్యుడికి కాస్త ఊరట లభించింది.