Petrol Price: ఈ రోజు పెట్రోల్ ధర ఎంతో తెలుసుకోవడానికి ఈ నెంబర్‌కు SMS పంపండి
Petrol Price: ఈ రోజు పెట్రోల్ ధర ఎంతో తెలుసుకోవడానికి ఈ నెంబర్‌కు SMS పంపండి
Petrol Price Today | పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. మరి తాజాగా పెట్రోల్ ధర ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? కేవలం ఓ ఎస్ఎంఎస్ చేస్తే చాలు. సింపుల్‌గా తెలిసిపోతుంది. మరి ఎలా మెసేజ్ పంపాలో తెలుసుకోండి.
1/ 10
1. పెట్రోల్, డీజిల్ ధరలో ఎప్పుడూ ఒకేలా ఉండవు. తరచూ మారుతుంటాయి. ధర తగ్గడమో, పెరగడమో లేదా కొంతకాలం పాటు ఒకేలా ఉండటం మామూలే. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు, డాలర్ రేటుపై పెట్రోల్, డీజిల్ రేట్స్ ఆధారపడి ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలను బట్టి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-BPCL, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL కంపెనీలు ధరల్ని సవరిస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
3. మరి లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరల్ని తెలుసుకోవడం ఎలా? చాలా సింపుల్. ఓ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు తెలుస్తోంది. 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
4. ఐఓసీఎల్ సూచించిన ఫార్మాట్లోనే 9224992249 ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. దేశంలోని వేర్వేరు పట్టణాలకు ఎస్ఎంఎస్ కోడ్ వేర్వేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
5. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవడానికి RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. విజయవాడలో రేట్ల కోసం RSP 127611, విశాఖపట్నంలో రేట్ల కోసం RSP 127290 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
6. ఇక న్యూఢిల్లీలో ధరల కోసం RSP 102072, బెంగళూరులో ధరల కోసం RSP 118219, ముంబైలో ధరల కోసం RSP 108412, చెన్నైలో ధరల కోసం RSP 133593 టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు కోడ్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
7. పైన చెప్పిన ఫార్మాట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు సంబంధించినది. భారత్ పెట్రోలియం బంకుల్లో రేట్ల కోసం 9223112222 నెంబర్‌కు, హిందుస్తాన్ పెట్రోలియం బంకుల్లో రేట్ల కోసం 9222201122 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
8. మారిన పెట్రోల్ ధరలు ఉదయం 6 గంటల నుంచి అమలులో ఉంటాయి. కాబట్టి వాహనదారులు ఏదైనా పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదా డీజిల్ తీసుకునేముందు ధరలను క్రాస్ చెక్ చేయడానికి ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
9. ఇకపై మీరు పెట్రోల్ లేదా డీజిల్ తీసుకోవడానికి ముందు ఓసారి ఎస్ఎంఎస్ పంపించి లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి. పెట్రోల్ బంకులో ఎక్కువ చెల్లించకుండా అప్రమత్తం కావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
10. ఎస్ఎంఎస్ ద్వారానే కాకుండా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వెబ్సైట్లు, మొబైల్ యాప్స్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)