వినియోగదారులకు షాక్. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో లీటర్కు రూ.5 వరకు పెరగనున్నాయి. అందుకు మార్కెట్ వర్గాలు కొన్ని కారణాలను చూపుతున్నాయి.
2/ 6
జూన్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఆ తర్వాత నుంచి పబ్లిక్ సెక్టార్ ఆయిల్ బ్యాంకింగ్ కంపెనీలు రోజువారీగా ధరలను సవరించే ప్రక్రియను మొదలుపెట్టబోతున్నాయి.
3/ 6
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రోజువారీగా ధరల సవరణను పునఃప్రారంభించాలనే అంశంపై గత వారం ఆయిల్ కంపెనీల రిటైలర్లు సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది.
4/ 6
ప్రస్తుతం నష్టాలకు ఆయిల్ విక్రయిస్తున్నట్టు కంపెనీలు భావిస్తున్నాయి. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ ధర 30 డాలర్లుగా ఉంది.
5/ 6
ఇదే ట్రెండ్ కొనసాగితే ఆయిల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఎక్సైజ్ ట్యాక్స్ భరించాల్సి ఉంటుంది. దీని వల్ల కంపెనీల మీద భారం పడే అవకాశం ఉంది.
6/ 6
ఈ క్రమంలో రోజుకు 40 పైసల నుంచి 50 పైసల వరకు పెంచుతూ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.