కర్నాటక బ్యాంక్‌లో వడ్డీ రేటు 13.18 శాతంగా ఉంది. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 11 శాతంగా ఉంది. దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 10.55 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
సౌత్ ఇండియా బ్యాంక్‌లో వడ్డీ రేటు 12.5 శాతంగా కొనసాగుతోంది. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. యాక్సిస్ బ్యాంక్‌లో చూస్తే.. వడ్డీ రేటు 12 శాతం నుంచే స్టార్ట్ అవుతోంది. ఇక కెనరా బ్యాంక్‌లో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 13.15 శాతంగా ఉంది. కాగా ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి.