Bank Loan: లోన్ తీసుకునే వారికి శుభవార్త.. ఈ బ్యాంకుల్లో రూపాయి కన్నా తక్కువ వడ్డీకే రుణాలు!
Bank Loan: లోన్ తీసుకునే వారికి శుభవార్త.. ఈ బ్యాంకుల్లో రూపాయి కన్నా తక్కువ వడ్డీకే రుణాలు!
Interest Rate | మీరు చౌక వడ్డీకే లోన్ పొందాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే పలు బ్యాంకుల్లో మీకు రూపాయి కన్నా తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి.
Bank News | లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నరా? అయితే మీకు శుభవార్త. పలు బ్యాంకులు చౌక వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంచాయి. మీరు రూపాయి కన్నా తక్కువ వడ్డకే లోన్ పొందొచ్చు. ఏ ఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి లోన్ వస్తోందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
2/ 16
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ పొందొచ్చు. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.3 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతం నుంచి ఉంటుంది.
3/ 16
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. 12.8 శాతం వరకు వడ్డీ పడుతుంది. లోన్ అమౌంట్‌పై ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
4/ 16
ఇండియన్ బ్యాంక్ తర్వాతి స్థానంలో ఉంది. ఈ బ్యాంక్‌లో కూడా వడ్డీ రేటు తక్కువగా ఉంది. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న కూడా ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి.
5/ 16
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చౌక వడ్డీకే రుణాలు అందిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.35 శాతంగా ఉంటుంది. గరిష్ట వడ్డీ రేటు 14.85 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతంగా ఉంది.
6/ 16
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అయితే వడ్డీ రేటు 10.35 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్ట వ్డడీ రేటు 21 శాతం వరకు ఉంటంది. ఈ బ్యాంక్‌లో ప్రాసెసింగ్ ఫీజు 2.5 శాతం వరకు ఉంది.
7/ 16
క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో వడ్డీ రేటును గమనిస్తే.. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్ట వడ్డీ రేటు 24 శాతం వరకు ఉంటుంది. ఈ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు 1 శాతంగా ఉంది.
8/ 16
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో చూస్తే.. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ఉంది. గరిష్ట వడ్డీ రేటు 24 శాతం వరకు పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు 3.5 శాతం వరకు ఉంటుంది.
9/ 16
ఐసీఐసీఐ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.75 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ బ్యాంక్‌లో గరిష్ట వడ్డీ రేటు 19 శాతం దాకా ఉంటుంది. అలాగే ఈ బ్యాంక్ లోన్ అమౌంట్‌పై 2.5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది.
10/ 16
బ్యాంక్ ఆఫ్ బరోడాలో చూస్తే.. ఈ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.9 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 18.25 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఇక ప్రాసెసింగ ఫీజు ఒక శాతం నుంచి 2 శాతం వరక ఉంటుంది.
11/ 16
ఐడీబీఐ బ్యాంక్‌లో గమనిస్తే.. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 11 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 15.45 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు ఒక శాతంగా ఉంటుంది.
12/ 16
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ)లో చూస్తే.. వడ్డీ రేటు 11 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 14 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు 1.5 శాతం పడుతుంది.
13/ 16
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 11.15 శాతం నుంచి ఉంది. అలాగే ఈ బ్యాంక్‌లో ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు పడుతుంది.
14/ 16
యాక్సిస్ బ్యాంక్‌లో గమనిస్తే.. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 13.65 శాతం వరకు వడ్డీ పడుతుంది.
15/ 16
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 11.4 శాతం నుంచి ఉంది. ఈ బ్యాంక్‌లో గరిష్టంగా 16.25 శాతం వరకు వడ్డీ పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు 1 శాతంగా ఉంటుంది.
16/ 16
కాగా సిబిల్ స్కోర్ ప్రాతిపదికన రుణాలపై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయని గుర్తించాలి. అంతేకాకుండా బ్యాంకులు ఎప్పటికప్పుడు రుణ రేట్లను సమీక్షిస్తూ వస్తాయి. అందువల్ల కొన్ని సార్లు తగ్గొచ్చు. మరికొన్ని సార్లు పెరగొచ్చు.