PERSONAL FINANCE TIPS KNOW HOW TO CALCULATE HOME LOAN BEFORE YOU APPLY SS
Home Loan: మీరు హోమ్ లోన్ ఎంత తీసుకోవచ్చో లెక్కించండి ఇలా
Home Loan Tips | మీరు హోమ్ లోన్ తీసుకునే అలోచనలో ఉన్నారా? హోమ్ లోన్ తీసుకునే ముందు మీ ఆదాయం, అప్పులు పరిగణలోకి తీసుకొని మీకు ఎంతవరకు హోమ్ లోన్ రావొచ్చో లెక్కించాలి. ఎలాగో తెలుసుకోండి.
1. సొంత ఇల్లు మీ కలా? హోమ్ లోన్ తీసుకొని అయినా ఈ కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? అసలు ఎంత హోమ్ లోన్ తీసుకోవాలో తెలియట్లేదా? మీ ఆదాయం, వయస్సును బట్టి మీకు ఇచ్చే ఇంటి రుణాన్ని నిర్ణయిస్తాయి బ్యాంకులు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
2. మీరు ఎంత హోమ్ లోన్ని భరించగలరు అన్నది మీ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే మీ వేతనాన్ని బట్టి మీరు ఎంత హోమ్ లోన్ భరించగలరో, ఈఎంఐ ఎంతవరకు చెల్లించాలో తెలుసుకోవడం సులువు. ఇందుకోసం ఓ చిన్న లెక్క చేస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
3. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు మీ వేతనంలో ఈఎంఐ 40 నుంచి 45 శాతం మించకుండా జాగ్రత్తపడతాయి. అంటే అకౌంట్లో నెలకు రూ.1,00,000 జీతం పడితే అందులో 40 నుంచి 45 శాతం మాత్రమే ఈఎంఐ ఉంటుంది. అంటే రూ.40,000 నుంచి రూ.45,000 మధ్య ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
4. ఒకవేళ మీరు పర్సనల్ లోన్‌కు రూ.10,000 చెల్లిస్తున్నట్టైతే మీ హోమ్ లోన్ ఈఎంఐ లిమిట్ రూ.30,000 ఉంటుంది. కారణం మీరు పర్సనల్ లోన్‌కు రూ.10,000 చెల్లిస్తుండటమే. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందే ఇతర లోన్స్ క్లియర్ చేయడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
5. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నట్టైతే ఇద్దరి ఆదాయంలో 40 శాతం ఈఎంఐ ఉండేలా హోమ్ లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు భార్యాభర్తలిద్దరికీ రూ.2,00,000 జీతం వస్తున్నట్టైతే రూ.80,000 వరకు ఈఎంఐ చెల్లించొచ్చు. అప్పుడు హోమ్ లోన్ ఎక్కువగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
6. మీరు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తంలో ఇల్లు తీసుకోవచ్చు. అయితే హోమ్ లోన్ మొత్తం చెల్లించేవరకు మీ భార్య ఉద్యోగం చేస్తూ ఉంటుందా అన్న ప్లానింగ్ కూడా ఉండాలి. ఒకరు ఉద్యోగం మానేస్తే ఇంకొకరి జీతంతో ఈఎంఐ, ఇంటి ఖర్చులు ప్లాన్ చేసుకోవడం భారం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
7. ఉదాహరణకు మీ ఈఎంఐ రూ.40,000 అనుకుంటే 8.5 శాతం వడ్డీ చొప్పున లెక్కేస్తే ఎంత లోన్ తీసుకోవచ్చో తెలుసుకోండి. మీరు 30 ఏళ్ల టెన్యూర్ పెట్టుకుంటే రూ.52 లక్షల నుంచి రూ.53 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
8. ఒకవేళ 25 ఏళ్ల టెన్యూర్ అయితే రూ.49 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు, 20 ఏళ్ల టెన్యూర్ అయితే రూ.46 లక్షల నుంచి రూ.47 లక్షల వరకు, 15 టెన్యూర్ అయితే రూ.40 లక్షల నుంచి రూ.41 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. మీ వేతనంలో మీ ఈఎంఐ 40 శాతం మించకుండా చూసుకోవాలి.
9/ 11
9. ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు మీ జీతం రూ.1,00,000 అయితే రూ.40,000 ఈఎంఐకి వెళ్తుంది. ఈఎంఐ పోగా మిగిలిన డబ్బులతో ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉంటే ఈఎంఐ చెల్లించడానికి ఇబ్బందులు తప్పవు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
10. హోమ్ లోన్ తీసుకునే ముందు ఈఎంఐ ఒకటే ప్లాన్ చేసుకుంటే సరిపోదు. డౌన్ పేమెంట్ కూడా ఆలోచించాలి. బ్యాంకులు 100% హోమ్ లోన్ ఇవ్వవు. మీరు 15 నుంచి 20 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. సో... మీ ఇంటి బడ్జెట్ పెరిగితే డౌన్ పేమెంట్ కూడా పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
11. మరి ఆ మేరకు సేవింగ్స్ ఉన్నాయో లేదో చూసుకొని ప్రాపర్టీని సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు మీరు రూ.50,00,000 ఇల్లు చూస్తే అందులో రూ.10,00,000 వరకు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)