సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆదేశం ప్రకారం, ప్రతి ఒక్క డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరును జత చేయాలి. ఇందుకు 2023 మార్చి 31వ తేదీయే చివరి గడువు. ఈ లోపు మీ డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరును యాడ్ చేయుకంటే మీ ఖాతా ఫ్రీజ్ అవుతుంది. అకౌంట్ ఫ్రీజ్ అయిందంటే, దాని ద్వారా మీరు ఎలాంటి స్టాక్ మార్కెట్ లావాదేవీలు చేయలేరు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టలేరు, రోజువారీ ట్రేడింగ్ చేయలేరు.
దీంతో డీమ్యాట్ అకౌంటు కోసం నామినీని జోడించడానికి పెట్టుబడి దారులకు చివరి అవకాశం ఇచ్చింది సెబీ. మీకు డీమ్యాట్ అకౌంటు ఉండి, ఇంకా నామినీని జోడించక పోతే, మార్చి 31 వరకు వేచి ఉండకుండా ఇప్పుడే చేయండి. అయితే నామినీల చేరికకు సంబం ధించి సెబీ జారీ చేసిన సర్క్యులర్‌లో ఏముంది? డీమ్యాట్ అకౌంటు కు నామినీని ఎలా జోడించాలో తెలుసుకోండి.
జూలై 2021లో, SEBI ఇప్పటికే అర్హులైన ట్రేడింగ్ , డీమ్యాట్ అకౌంటు దారులందరికీ నామినేషన్ కోసం ఒక ఆప్షన్ ను అందించింది. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు జూలై 2021లో సర్క్యులర్‌కు ముందు నామినీ సమాచారాన్ని సమర్పించినట్లయితే, వారు దానిని మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదని సెబీ తెలిపింది. ఇప్పటి వరకు నామినీ సమాచారాన్ని సమర్పించని పెట్టుబడిదారులకు మార్చి 31 వరకు గడువు ఉంది.
ఇంకా నామినీని జోడించని పెట్టుబడిదారులు తమ నామినీని సమర్పించవచ్చు లేదా స్టాక్‌బ్రోకర్ల ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో నామినీని సమర్పించవచ్చు. ప్రత్యామ్నాయంగా, అటువంటి సేవలను అందించే డిపాజిట్ భాగస్వాములతో నామినీలను సమర్పించడానికి అవకాశం ఉంది. నామినీ లేదా మైనర్ నామినీ సంరక్షకుని మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ID , గుర్తింపు వివరాలను అందించడం వారి ఎంపికపై ఆధారపడి ఉంటుంది.
నామినీ పేరును చేర్చడానికి మీరు చేసే దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం, కేవలం 2 రెండు నిమిషాల్లో మీ వైపు నుంచి పని పూర్తవుతుంది. ఆ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి 24 - 48 గంటల సమయం పడుతుంది. కాబట్టి, చివరి రోజు వరకు కాలయాపన చేయవద్దు. వీలయితే ఇవాళే, లేదా చివరి తేదీకి కనీసం మూడు రోజుల ముందయినా నామినేషన్ కోసం దరఖాస్తు చేయండి.