ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఒకప్పటిలా లేదు. వ్యక్తులు జరిపే ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు ఐటీ శాఖ ఫోకస్ బాగా పెరిగింది. గత కొన్నేళ్ల నుంచి బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బ్రోకర్ ప్లాట్‌ఫారమ్ సహా వివిధ పెట్టుబడి సాధనాల్లో ప్రజల జరిపే నగదు లావాదేవీలకు సంబంధించిన నిబంధనలను ఐటీ శాఖ కఠినతరం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం )
అయితే ఐటీ శాఖ దృష్టి పెట్టే ఇలాంటి లావాదేవీలు చాలా ఉన్నాయనే విషయం మనలో చాలామందికి తెలియదు. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకరేజ్ హౌస్‌లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్లతో పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు చేపడితే.. అందుకు సంబంధించి ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాలి. అలాంటి ఐదు లావాదేవీల గురించి తెలుసుకోవడం మంచిది.(ప్రతీకాత్మక చిత్రం )
చాలామంది బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఎఫ్‌డిలో ఒకే సంవత్సరంలో లేదా అంతకంటే ఎక్కువసార్లు డిపాజిట్ చేస్తే ఐటీ శాఖ మిమ్నల్ని ఇందుకు సంబంధించి వివరణ కోరే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. వీలైతే ఆన్లైన్ లేదా చెక్ ద్వారా ఎక్కువ డబ్బును FDలో డిపాజిట్ చేయడం మంచిది.(ప్రతీకాత్మక చిత్రం )
చాలామంది క్రెడిట్ కార్డ్ బిల్లును కూడా నగదు రూపంలో డిపాజిట్ చేస్తుంటారు. అలా ఒకేసారి రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు క్రెడిట్ కార్డ్ బిల్లుగా డిపాజిట్ చేస్తే.. ఐటీ శాఖ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లించినప్పుడు కూడా ఆ మొత్తానికి సంబంధించి వివరాలు గురించి అడిగే అవకాశం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం )
ఇక షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు, బాండ్లలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసినా మీరు ఐటీతో సమస్యలు ఎదుర్కోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇటువంటి పెట్టుబడుల్లో గరిష్టంగా రూ. 10 లక్షల వరకు నగదు లావాదేవీలు చేయొచ్చు. కాబట్టి వీటిలో డబ్బును పెట్టుబడి పెట్టే ఆలోచన మీకు ఉంటే.. మీరు పెద్ద మొత్తంలో నగదును ఉపయోగించాల్సిన అవసరం లేదు.(ప్రతీకాత్మక చిత్రం )