2. కమర్షియల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (NBFCs) ఒప్పందం కుదుర్చుకొని చిరు వ్యాపారులకు కొలాటరల్ ఫ్రీ ఇన్స్టంట్ లోన్స్ అందజేస్తోంది. వ్యాపారులు పేటీఎం ఫర్ బిజినెస్ (Paytm for Business) యాప్‌లో మర్చెంట్ లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా రుణాలు తీసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం డిజిటల్ పద్ధతిలో పూర్తవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. వ్యాపారులు పేటీఎం ఫర్ బిజినెస్ యాప్‌లో కేవలం ఐదు స్టెప్స్‌లో రుణాలు తీసుకోవచ్చు. ఈ రుణాలకు వడ్డీ రేట్లు తక్కువ. అంతేకాదు... డైలీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అంటే ప్రతీ నెలా వాయిదా చెల్లించాల్సిన అవసరం లేకుండా రోజూ కొంత మొత్తం చెల్లించొచ్చు. వ్యాపారుల డైలీ సెటిల్మెంట్లోనే లోన్ ఈఎంఐని తీసుకుంటుంది పేటీఎం. ఈ రుణాలకు ఎలాంటి ప్రీపేమెంట్ ఛార్జీలు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
4. పేటీఎంలో బిజినెస్ లోన్‌కు అప్లై చేయడానికి పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేయాలి. ఈ యాప్‌లో హోమ్ స్క్రీన్ పైన Business Loan ఐకాన్ పైన క్లిక్ చేయాలి. లోన్ ఎంత కావాలో అమౌంట్ ఎంటర్ చేయాలి. అందులోనే టెన్యూర్, డైలీ ఇన్స్టాల్మెంట్ లాంటి వివరాలు ఉంటాయి. ఆ తర్వాత వివరాలన్నీ సరిచూసుకొని కన్ఫామ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. సీకేవైసీ నుంచి మీ కేవైసీ వివరాలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత పాన్ కార్డ్ వివరాలు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలను కన్ఫామ్ చేయాలి. మీ పాన్ వివరాలు, క్రెడిట్ స్కోర్, కేవైసీ వెరిఫై అవుతాయి. ఇక చివరి స్టెప్‌లో లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. లోన్ మొత్తం బ్యాంకు అకౌంట్లోకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ లోన్ తీసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. వ్యాపారుల క్రెడిట్ హిస్టరీ, రోజువారీ లావాదేవీలను బట్టి వారికి యాప్‌లోనే రుణాలు మంజూరవుతాయి. మర్చంట్ లోన్స్ అంటే వ్యాపారులకు ఇచ్చే లోన్స్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 38 శాతం పెరిగిందని, లోన్ వ్యాల్యూ 128 శాతం పెరిగిందని మూడో త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది పేటీఎం. 25 శాతం కంటే ఎక్కువ కొత్త వ్యాపారులకు రుణాలు ఇచ్చామని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)