2. యూజర్లకు ఇంత వేగంగా అప్పులు ఇచ్చేందుకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సర్వీస్‌ను పేటీఎం లాంఛ్ చేసింది. 10 లక్షల మంది కస్టమర్లకు ఈ పర్సనల్ లోన్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. డిజిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్థిక సేవలు అందించడంలో భారతదేశంలో పేటీఎం ముందు ఉందన్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
6. లోన్ దరఖాస్తు నుంచి రుణం మంజూరు చేయడం వరకు ఎక్కడా ఫిజికల్ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ ప్రాసెస్ మొత్తం కేవలం 2 నిమిషాల్లో పూర్తి కావడం మరో విశేషం. పేటీఎం ఇన్స్టంట్ పర్సనల్ లోన్ స్కీమ్ ద్వారా రూ.2,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. 18 నుంచి 36 నెలల మధ్య ఈఎంఐ ద్వారా రీపేమెంట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. పేటీఎంలో ఇన్స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్షన్లో Personal Loan ట్యాబ్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి. లోన్ అకౌంట్ వివరాలను కూడా ఇక్కడే చూసుకోవచ్చు. బీటా దశలో 400 మంది సెలెక్టెడ్ కస్టమర్లకు రుణాలు మంజూరు చేసింది పేటీఎం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 10 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది పేటీఎం. (ప్రతీకాత్మక చిత్రం)