1. తరచూ పలురకాల మందులు వాడేవారికి అలర్ట్. పెయిన్ కిల్లర్స్ (Pain Killers) నుంచి యాంటీబయాటిక్స్ వరకు పలురకాల మెడిసిన్స్ ధరలు పెరిగాయి. నిత్యం ఉపయోగించే మందుల కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తాయి. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)తో తిరిగి సర్దుబాటు చేసిన తర్వాత, పలురకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరలు దాదాపు 12 శాతం వరకు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ మందులలో చాలా వరకు యాంటీ-ఇన్ఫెక్టివ్‌లు, పెయిన్‌కిల్లర్స్, కార్డియాక్, యాంటీబయాటిక్ లాంటి ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి. ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్‌లో 384 మెడిసిన్స్ ఉన్నాయి. అందులో హాలోథేన్, ఐసోఫ్లోరేన్, కెటామైన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన సాధారణ మత్తుమందులు, ఆక్సిజన్ మందులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. వీటితో పాటు పెయిన్ కిల్లర్స్: డిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెట్మాల్, మార్ఫిన్, పాయిజనింగ్‌లో యాంటీడోట్స్: యాక్టివేటెడ్ చార్కోల్, డి-పెనిసిల్లమైన్, నాలాక్సోన్, స్నేక్ వెనమ్ యాంటీసెరమ్, యాంటికాన్వల్సెంట్స్: క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్, పార్కిన్సన్స్, డిమెన్షియా: ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)