1. ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి పాన్ కార్డ్ (PAN Card) తప్పనిసరిగా కావాల్సిన డాక్యుమెంట్. ప్రతీ ట్రాన్సాక్షన్‌కు కాకపోయినా కాస్త ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపితే పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాల్సిందే. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా పాన్ నెంబర్ వెల్లడించాలని ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) కొత్త రూల్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. పాన్ కార్డ్ లేనివాళ్లు ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఒక రోజులో రూ.50,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాల్సిందే. ఇలా పెద్దమొత్తంలో జరిపే లావాదేవీలకు పాన్ కార్డ్ వివరాలు తప్పనిసరి. పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆదాయపు పన్ను శాఖ పలుమార్లు డెడ్‌లైన్స్ కూడా విధించింది. చివరి డెడ్‌లైన్ 2022 మార్చి 31న ముగిసింది. ఈ డెడ్‌లైన్ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేస్తే ఫైన్ చెల్లించాలని కూడా ప్రకటించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేస్తే రూ.500 జరిమానా చెల్లించాలని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అంటే ఈ నెల 30వ తేదీ లోపు పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేస్తే రూ.500 ఫైన్ చెల్లించాలి. ఆ తర్వాత అంటే జూలై 1 నుంచి పాన్, ఆధార్ లింక్ చేస్తే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు పాన్, ఆధార్ లింక్ చేయనివారు జూన్ 30 లోపు రూ.500 ఫైన్‌తో ఈ రెండు డాక్యుమెంట్స్ లింక్ చేయొచ్చు. జూలై 1 నుంచి రూ.1,000 జరిమానా చెల్లించాలి. మరి పెనాల్టీ ఎలా చెల్లించాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp వెబ్సైట్ ఓపెన్ చేయాలి. CHALLAN NO./ITNS 280 పైన క్లిక్ చేసి Proceed పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కంపెనీలకు అయితే కార్పొరేట్ ట్యాక్స్, వ్యక్తిగతంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. Type of Payment సెక్షన్లో Other Receipts పైన క్లిక్ చేయాలి. పాన్ కార్డ్ వివరాలు సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసి అడ్రస్ పూర్తి చేయాలి. ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి. పేమెంట్ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీరు చెల్లించిన ఫైన్ వివరాలు 4 నుంచి 5 వర్కింగ్ డేస్‌లో ఆదాయపు పన్ను శాఖ రికార్డ్స్‌లో అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పాన్, ఆధార్ లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ముందుగా https://www.incometax.gov.in/iec/foportal ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Link Aadhaar పైన క్లిక్ చేయాలి. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Validate పైన క్లిక్ చేయాలి. మీ పేమెంట్ వివరాలు వెరిఫై అయినట్టు మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత Continue పైన క్లిక్ చేయాలి. ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Validate చేస్తే మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)