మీరు ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు (Transactions) జరుపుతుంటారా? భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? అయితే మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ కార్డ్ (PAN Card) తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరపడానికి పాన్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్ అన్న సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) జారీ చేసే ఈ పాన్ కార్డ్ చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
పెద్ద స్థాయిలో లావాదేవీలు జరపాలంటే పాన్ నెంబర్ (PAN Number) ఉండాల్సిందే. లేకపోతే ఆ లావాదేవీలు జరపలేరు. పన్ను చెల్లింపులు, ఆదాయపు పన్ను రిటర్న్స్, కొనుగోళ్లు... ఇలా చాలా సందర్భాల్లో పాన్ నెంబర్ అవసరం. ఆదాయపు పన్ను చట్టంలోని 114బీ రూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కన్స్యూలర్ ఆఫీసులు తప్ప అందరూ పాన్ కార్డు ఇవ్వాల్సిందే. మరి ఏఏ లావాదేవీల్లో పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
పైన వెల్లడించిన జాబితాలో 3, 5, 6, 9, 11, 13, 18 పాయింట్స్‌లో నాన్ రెసిడెంట్ పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆదాయం లేని ఇక మైనర్లు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పాన్ కార్డ్ ఇవ్వొచ్చు. ఇక పాన్ కార్డ్ లేనివాళ్లు పైన వెల్లడించిన లావాదేవీలు జరిపినట్టైతే ఆదాయపు పన్ను శాఖ నోటీస్ లేదా విచారణ ఎదుర్కోకుండా ఉండేందుకు ఫామ్ నెంబర్ 60 లో డిక్లరేషన్ ఇవ్వొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)