PAN CARD CORRECT YOUR PAN CARD MISTAKES THROUGH ONLINE AND OFFLINE KNOW EASY STEPS SS
PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...
Corrections in PAN Card | మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? పేరులో స్పెల్లింగ్ మిస్టేక్, డేట్ ఆఫ్ బర్త్, తండ్రిపేరులో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పాన్ కార్డు కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
పాన్ కార్డ్... ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇది. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిపేవారికి అతి ముఖ్యమైన ఐడీ కార్డు ఇది. అంతేకాదు... ఐడెంటిటీ ప్రూఫ్ కోసం కూడా పాన్ కార్డు ఉపయోగపడుతుంది.
2/ 9
పాన్ కార్డుపై ఉంటే 10 ఆల్ఫాన్యూమరికల్ కోడ్ ప్రతీ ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే కొన్ని పొరపాట్ల వల్ల ఒకే పాన్ నెంబర్‌తో రెండు కార్డులు జారీ అయిన సందర్భాలున్నాయి.
3/ 9
అంతేకాదు... పాన్ కార్డులో తప్పులు దొర్లుతుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ... తర్వాత ఎప్పుడైనా ఏదైనా దరఖాస్తు చేసినప్పుడు పాన్ కార్డులో ఉన్న తప్పుల వల్ల దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశముంది. పాన్ కార్డులో తప్పులుంటే ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సరిదిద్దుకోవచ్చు.
4/ 9
ఆన్లైన్లో పాన్ కార్డ్ కరెక్షన్స్ కోసం అధికారిక వెబ్సైట్ https://www.tin-nsdl.com/index.html ఓపెన్ చేయాలి. 2. మొదటి పేజీలోనే కనిపించే Paperless PAN application ట్యాబ్ క్లిక్ చేయాలి.
5/ 9
అప్లికేషన్ టైప్‌లో changes or correction in existing PAN సెలెక్ట్ చేయండి. కేటగిరీలో Individual క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు, తండ్రిపేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
6/ 9
మీ ఆన్లైన్ అప్లికేషన్‌కు టోకెన్ నెంబర్ వస్తుంది. టెంపరరీ టోకెన్ నెంబర్‌తో లాగిన్ చేసి మీ పూర్తి వివరాలను సరిగ్గా ఎంటర్ చేసి అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, పాత పాన్ కార్డ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
7/ 9
ఆన్లైన్ ద్వారా పేమెంట్ పూర్తి చేసిన తర్వాత ఇ-సైన్ ప్రక్రియ పూర్తి చేయాలి. తర్వాత మీ పాన్ కరెక్షన్ దరఖాస్తు అప్లోడ్ అవుతుంది.
8/ 9
ఆఫ్‌లైన్‌లో పాన్ కార్డులో తప్పులు సరిదిద్దుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ https://www.incometaxindia.gov.in ఓపెన్ చేసి Request for Correction క్లిక్ చేస్తే పాన్ కరెక్షన్కు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
9/ 9
డౌన్లోడ్ చేసిన పాన్ కరెక్షన్ ఫామ్ పూర్తి చేసి, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ప్రస్తుత పాన్ కార్డు జిరాక్స్, ఫోటోలను జతచేసి దగ్గర్లో ఉన్న NSDL సెంటర్లో ఇవ్వాలి.