1. పాన్-ఆధార్ లింకింగ్: పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతేడాదే స్పష్టం చేసింది. గతంలో 2018 జూన్ 30 చివరి తేదీ ఉండగా... ఈ గడువును పొడిగించింది. ఆదాయపు పన్ను చట్టంలోని 139 ఏఏ సెక్షన్ ప్రకారం పాన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సిందే. ఇందుకోసం గడువు మార్చి 31.
2. జీఎస్టీ యాన్యువల్ రిటర్న్: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వార్షిక రిటర్న్ ఫైల్ చేయడానికి కూడా మార్చి 31 చివరి తేదీ. వ్యాపారులు మార్చి 31 లోపే తమ రిటర్న్ ఫైల్ చేయాలి. 2018 డిసెంబర్ 31 ఉన్న గడువును పొడిగించింది. సేల్, పర్చేస్, ఇన్పుట్ ట్యాక్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలి.