4. ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని, వాటిని ఉపయోగించడానికి వీల్లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ప్రకటించే అవకాశముంది. డెడ్లైన్ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 'పనిచేయనివి'గా గుర్తించాలని ఫైనాన్స్ బిల్లులో సైతం వెల్లడించింది ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
5. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ను లింక్ చేయడానికి 4 మార్గాలున్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా మీ ఆధార్ నెంబర్ను పాన్ కార్డుతో ఆన్లైన్లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు సూచించిన ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాలి. UIDPAN<12 అంకెల ఆధార్><10 అంకెల పాన్> అని మెసేజ్ చేయాలి. ఉదాహరణ: UIDPAN 111122223333 AAAPA9999Q (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆన్లైన్లోనూ పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు. ముందుగా incometaxindiaefiling.gov.in వెబ్సైట్లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)