2. పాన్ ఆధార్ లింకింగ్ (PAN-Aadhaar Linking), అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్, ఐటీఆర్ ఫైలింగ్, ప్రధాన మంత్రి వయ వందన యోజన (Pradhan Mantri Vaya Vandana Yojana) పథకం లాంటి అనేక అంశాలకు సంబంధించి ఈ నెలలోనే డెడ్‌లైన్స్ ఉన్నాయి. మరి వాటిలో మీరు గుర్తుంచుకోవాల్సిన డెడ్‌లైన్స్ ఏంటీ? మార్చి 31 లోపు ఏం చేయాలి? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. PAN-Aadhaar Linking: ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింకింగ్ కోసం అనేకసార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 31 తో ముగిసిన గడువును రూ.1,000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు పొడిగించింది. ఇప్పుడు ఆ గడువు కూడా ముగియబోతోంది. అప్పట్లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డులు చెల్లవు. (ప్రతీకాత్మక చిత్రం)
4. Advance tax payment: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చెల్లించడానికి 2023 మార్చి 15 వరకే అవకాశం ఉంది. ఇది చివరి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్. దీంతో పన్ను చెల్లింపుదారులు 100 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్టవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 208 ప్రకారం, సంవత్సరానికి అంచనా వేసిన పన్ను రూ.10,000 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్టైతే ముందస్తు పన్ను రూపంలో ఆ ట్యాక్స్‌ను ముందుగానే చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది జీతం కాకుండా ఇతర ఆదాయ వనరులను కలిగి ఉన్న వ్యక్తులు చెల్లించాల్సిన పన్ను. అద్దె, షేర్లపై వచ్చిన లాభాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లాటరీల ద్వారా వచ్చిన మొత్తానికి వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ITR: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్డేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ. FY19-20 కోసం ఫైల్ చేయడం మానేసిన లేదా ఏదైనా ఆదాయాన్ని నివేదించని పన్ను చెల్లింపుదారులు నవీకరించబడిన ITR లేదా ITR-Uని ఫైల్ చేయవచ్చు. 2022 ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ వ్యవధిని అనుమతించడానికి అప్డేటెడ్ రిటర్న్స్ విధానాన్ని తీసుకొచ్చింది ఆదాయపు పన్ను శాఖ. కొన్ని షరతులకు లోబడి అసెస్మెంట్ ఇయర్ ముగిసిన 24 నెలలలోపు అప్డేట్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. Pradhan Mantri Vaya Vandana Yojana: కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ. 60 ఏళ్లు దాటినవారు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి 7.4 వార్షిక వడ్డీ పొందవచ్చు. 10 ఏళ్ల పాటు ఇదే వడ్డీ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)