1. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ (PAN Card) హోల్డర్స్ తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ను లింక్ చేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే. గతేడాది 2022 మార్చి 31న గడువు ముగిసింది. అయితే రూ.1,000 జరిమానా చెల్లించి 2023 మార్చి 31 వరకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ (PAN-Aadhaar Link) చేసే వెసులుబాటు కల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కాబట్టి పాన్ కార్డ్ హోల్డర్స్కు ఇంకొన్ని రోజులు గడువు ఉంది. 2023 మార్చి 31 వరకు పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ కార్డ్ చెల్లదు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం మినహాయింపు కేటగిరీ పరిధిలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్స్ 2023 మార్చి 31 లోగా ఆధార్ నెంబర్ లింక్ చేయాలని, లేకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ కార్డ్ చెల్లదని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ట్వీట్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మినహాయింపు కేటగిరీ పరిధిలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్స్ తప్పనిసరిగా ఆధార్ నెంబర్ లింక్ చేయాలన్నది ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ ప్రకారం తెలుస్తుంది. మరి మినహాయింపు కేటగిరీ ఎవరికి వర్తిస్తుంది? పాన్ ఆధార్ లింకింగ్ ఎవరికి తప్పనిసరి కాదు? అన్న సందేహాలు పాన్ కార్డ్ హోల్డర్స్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. పైన వివరించినవారు కాకుండా ఇతరులు తప్పనిసరిగా తమ పాన్ నెంబర్ను ఆధార్ నెంబర్కు లింక్ చేయాల్సిందే. ఇప్పుడు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి రూ.1,000 జరిమానా చెల్లించాలన్న విషయం గుర్తుంచుకోండి. www.incometaxindiaefiling.gov.in వెబ్సైట్లో పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)