March 2023 | మార్చి నెలలోకి అడుగు పెట్టేశాం. ఈ నెల చివరకు వచ్చేసరికి పలు అంశాలను ముగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వాటికి మార్చి 31 డెడ్లైన్ ఉంది. అందువల్ల వచ్చే నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందువల్ల ఈ నెల చివరి కల్లా ఏ ఏ పనులను పూర్తి చేయాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
పాన్ కార్డు చెల్లుబాటు కాకపోతే బ్యాంక్ అకౌంట్ తెరవలేరు. ఐటీఆర్ రిఫండ్ రాదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయలేరు. అలాగే టీడీఎస్ వంటివి ఎక్కువగా కట్ అవుతాయి. పాన్ ఆధార్ లింక్ లేట్ ఫీజు రూ.1000గా ఉంది. అందువల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే వెంటనే పాన్ ఆధార్ అనుసంధానం చేసుకోండి