అందువల్ల మీరు పాన్ కార్డు కలిగి ఉంటే.. పైన పేర్కొన్న విభాగాలకు చెంది ఉంటే.. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిన పని లేదు. అయితే వ్యక్తులు మాత్రం కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సిందే. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. పెనాల్టీ పడుతుంది. అలాగే పాన్ కార్డు పని చేయదు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు పాన్ ఆధార్ కార్డుల లింక్‌కు చాలా సార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. అలాగే రేషన్ కార్డు, ఓటర్ కార్డులతో ఆధార్ లింక్ గడువు కూడా ఇటీవలనే ఎక్స్టెండ్ చేసింది .ఈ క్రమంలో పాన్ ఆధార్ డెడ్‌లైన్ పొడిగింపు కూడా ఉండొచ్చని కొంత మంది అంచనా వేస్తున్నారు. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.