2023 Personal Finance Calendar | మీకు పాన్ కార్డు ఉందా? లేదంటే ఈపీఎఫ్‌వో ఖాతాదారులా? ట్యాక్స్ పేయర్లా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. 2023 డెడ్‌లైన్స్ ఏంటివో ముందే తెలుసుకోవడం ఉత్తమం.
Key Dates For 2023 | గత సంవత్సరంలో చేసిన తప్పులను కొత్త ఏడాదిలో చేయకూడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మనీ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ ఏడాదిలో గుర్తించుకోవాల్సిన 17 ఫైనాన్సియల్ డెడ్‌లైన్స్ ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
2/ 18
జనవరి 30 – ఆలస్యంగా దాఖలు చేసిన ఐటీఆర్ వెరిఫై చేయాలి. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన ఐటీఆర్ వెరిఫైకి కూడా ఇదే డెడ్‌లైన్. ఐటీఆర్ ఫైలింగ్‌కు డిసెంబర్ 31తో గడువు ముగిసిన విషయం తెలిసిందే.
3/ 18
ఈపీఎస్ నుంచి అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి 2023 మార్చి 3 డెడ్‌లైన్‌గా ఉంది. అందువల్ల అర్హత కలిగిన వారు వెంటనే అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన ఉద్యోగులు కంపెనీతో కలిసి జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
4/ 18
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడానికి మార్చి 15 డెడ్‌లైన్‌గా ఉంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
5/ 18
మార్చి 31తో ఫైనాన్షియల్ ముగుస్తుంది. దీంతో ఈ రోజున చాలా వాటికి డెడ్‌లైన్ ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి మార్చి 31 వరకు గడువు ఉంది. ఆ తర్వాత పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అందుకే వెంటనే ఈ రెండింటినీ లింక్ చేసుకోండి.
6/ 18
ట్యాక్స్ సేవింగ్స్ కూడా మార్చి 31 చివరి తేదీ. అందువల్ల ఈ డెడ్‌లైన్ కన్నా ముందుగానే డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు దాచుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు.
7/ 18
సీనియర్ సిటిజన్స్‌కు గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌లో చేరడానికి మార్చి 31 వరకే గడువు ఉంది. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ మార్చి తర్వాత ఉండదు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. రూ. 15 లక్షల వరకు ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు రూ. 9250 వరకు పెన్షన్ వస్తుంది.
8/ 18
లోన్ తీసుకొని ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన వారు ట్యాక్స్ డిడక్షన్ పొందటానికి మార్చి 31 వరకే గడువు ఉంటుంది. సెక్షన్ 80ఈఈబీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. లోన్ మొత్తంపై చెల్లించిన వడ్డీపై పన్ను తగ్గింపు ఉంటుంది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ట్యాక్స్ డిడక్షన్ ఉండదు.
9/ 18
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్డేడెట్ ఐటీఆర్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తుంది. అందుకే ముందుగానే ఈ పని పూర్తి చేసుకోండి.
10/ 18
నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పేయర్లు డబుల్ ట్యాక్స్ అయిడ్నస్ అగ్రిమెంట్ బెనిఫిట్ పొందాలని భావిస్తే.. అలాంటి వారు 10 ఎఫ్ సమర్పించాల్సి ఉంటుంది. పాన్ కార్డు లేని ఎన్ఆర్ఐలు ఇండియాలో పొందిన ఆదాయంపై టీడీఎస్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఫామ్ ఇవ్వాలి. దీనికి మార్చి 31 డెడ్‌లైన్.
11/ 18
ఆర్బీఐ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 కల్లా ఇంటర్నల్ అంబుడ్స్‌మెన్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి ప్రజలు క్రెడిట్ స్కోర్ ఫిర్యాదులను ఇంటర్నల్ అంబుడ్స్‌మెన్ ద్వారా చేయొచ్చు.
12/ 18
2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేయడానికి జూన్ 15 డెడ్‌లైన్‌గా ఉంది.
13/ 18
అలాగే 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలుకు ఫామ్ 16 పొందటానికి జూన్ 15 గడువుగా ఉంది. ఫామ్ 16 అనేది టీడీఎస్ సర్టిఫికెట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉద్యోగి వేతనం, ట్యాక్స్ డిడక్షన్స్, ఇతర వివరాలు ఉంటాయి.
14/ 18
2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీ జూలై 31గా ఉంది. ఈ డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5 వేలు జరిమానా పడుతుంది.
15/ 18
2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడానికి సెప్టెంబర్ 15 డెడ్‌లైన్‌గా ఉంది.
16/ 18
గవర్నమెంట్ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి నవంబర్ 30 చివరి గడువు. లేదంటే వారికి పెన్షన్ రాదు. ఆగిపోతుంది.
17/ 18
2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడో ఇన్స్టాల్మెంట్ అడ్వాన్స్ ట్యాక్స్ చెలింపునకు డిసెంబర్ 15 డెడ్‌లైన్‌గా ఉంది.
18/ 18
2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆలస్యమైన లేదా సవరించిన ఐటీఆర్‌కు డిసెంబర్ 31 డెడ్‌లైన్‌గా ఉందని గుర్తించుకోవాలి.