పాన్-ఆధార్ లింక్ గడువును ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. మార్చి 31 తరువాత మళ్లీ పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో పాన్-ఆధార్ లింక్ చేయనివారు వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయడం బెటర్. ఒకవేళ ఇలా చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి వారి పాన్‌కార్డ్ పనిచేయకపోవచ్చు. ఫలితంగా దీన్ని ఉపయోగించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపడానికి అవకాశం ఉండదు.
* లింక్ చేయకపోతే ఎదురయ్యే పరిణామాలు : ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయకపోతే అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా లింక్ చేయని కారణంగా పాన్ చెల్లుబాటు కాదు. దీంతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేరు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రిటర్న్స్ కూడా ప్రాసెస్ కావు. అలాగే పెండింగ్‌లో ఉన్న రిఫండ్స్ సైతం జారీ చేయడం సాధ్యం కాదు. పెండింగ్ ప్రొసీడింగ్స్ క్లియర్ చేయడానికి వీలుపడదు.
కాగా, ఆధార్‌తో పాన్ లింక్‌ను SMS ద్వారా, ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. SMS లింక్ కోసం ముందుగా స్మార్ట్ ఫోన్లో మెసేజ్ యాప్ ఓపెన్ చేయాలి. అందులో UIDPAN < SPACE > <12-అంకెల ఆధార్ నంబర్ > < SPACE > < 10-అంకెల పాన్ నంబర్ > ఎంటర్ చేసి 567678 లేదా 56161కి SMS చేసి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. ఇక ఆఫ్‌లైన్‌లో లింక్ కోసం సమీపంలోని పాన్ లేదా ఆధార్ సెంటర్‌ను విజిట్ చేయాల్సి ఉంటుంది.