1. పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ అనేకసార్లు గడువు పొడిగించింది. చివరిసారిగా పొడిగించిన గడువు 2022 మార్చి 31న ముగిసింది. అయినా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ (PAN Aadhaar Linking) చేయనివారు 2023 మార్చి 31 వరకు ఈ పనిచేయొచ్చు. కానీ మొదటి మూడు నెలలు రూ.500, తర్వాత 9 నెలలు రూ.1,000 జరిమానా చెల్లించాలి. అప్పటివరకు పాన్ కార్డు (PAN Card) పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. పాన్ కార్డ్ హోల్డర్స్ 2023 మార్చి 31 లోగా కూడా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ (Aadhaar Card) లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ ఇనాపరేటీవ్‌గా మారిపోతుంది. అంటే ఆ పాన్ కార్డ్ ఇక చెల్లదు. ఆ పాన్ కార్డును ఎక్కడా లావాదేవీల్లో ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ లావాదేవీల్లో పాన్ నెంబర్ ఇచ్చినా ఆ లావాదేవీ చెల్లదు. అంతేకాదు... ప్రభుత్వ సేవలు పొందడానికి కూడా వీల్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇనాపరేటీవ్ పాన్ ఉపయోగించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం కుదరదు. పెండింగ్‌లో ఉన్న రిటర్న్స్ ప్రాసెస్ కావు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్స్ విడుదల కావు. పాన్ ఇనాపరేటీవ్‌గా మారితే రిటర్న్స్‌లో ఏవైనా తప్పులు ఉన్నా సరిదిద్దుకునే అవకాశం ఉండదు. పాన్ ఇనాపరేటీవ్‌గా మారుతుంది కాబట్టి ఎక్కువగా పన్నులు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి. తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)