Edible Oil: సామాన్యులకు షాక్.. పెరగనున్న వంట నూనె ధరలు! ఎందుకంటే?
Edible Oil: సామాన్యులకు షాక్.. పెరగనున్న వంట నూనె ధరలు! ఎందుకంటే?
Cooking Oil | వంట నూనె ధరలు మళ్లీ పెరగనున్నాయి. దీంతో సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. వంట నూనె ధరలు ఎందుకు పెరగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Oil Prices | సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడనుందా? వంట నూనె ధరలు మళ్లీ పెరగబోతున్నాయా? పామ్ ఆయిల్ ధరలు కొండెక్కనున్నాయా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. రానున్న కాలంలో వంట నూనె ధరలు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
2/ 9
వంట నూనె ఎగుమతులకు సంబంధించిన ప్రధాన దేశాల్లో భారీ వర్షాలు కురవడం, అలాగే డిమాండ్ పెరిగిపోవడం వంటి అంశాల కారణంగా వంట నూనె ధరలు పైకి చేరొచ్చని పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇదే జరిగితే సామాన్యులపై భారం పడనుంది.
3/ 9
పామ్ ఆయిల్ ధరలు ఇప్పటికే పెరిగాయి. ఇది వరకు దీని రేటు కేజీకి రూ. 90కు పడిపోయింది. అయితే ఇప్పుడు పామ్ ఆయిల్ రేటు కేజీకి రూ.110కు చేరింది. అంటే ఇప్పటికే ఆయిల్ రేటు పైకి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రేటు మార్చి నెలలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. అప్పటితో పోలిస్తే రేటు ఇంకా దిగువునే ఉంది.
4/ 9
రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటికే దేశంలో ధరలు భారీగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ట స్థాయిల్లోనే ఉంది. ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరగడం వల్ల ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
5/ 9
మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల్లో అధిక ఎగుమతులు ఉన్నాయి. అలాగే డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. పామ్ ఆయిల్‌ను అటు వంట నూనెగా, ఇటు బయో ఫ్యూయెల్‌గా ఉపయోగిస్తారు. ఇంకా ఇతరత్రా వాటిల్లో కూడా వినియోగిస్తారు.
6/ 9
దీంతో డిమాండ్ పెరగడం, ఎగుమతులు ఎక్కువగా ఉండటం, వర్షాల దెబ్బకి పంట దిగుబడి తగ్గడం వల్ల రానున్న కాలంలో వంట నూనె ధరలు పైపైకి కదిలే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని వల్ల ప్రజలపై భారం పడనుంది.
7/ 9
భారత ప్రభుత్వం పామ్ ఆయిల్ దిగుమతి రేటును టన్నుకు 776 డాలర్లుగా నిర్ణయించింది. నవంబర్ నెలకు ఇది వర్తిస్తుంది. ఇందులోనే ఇన్సూరెన్, ట్రాన్స్‌పోర్టేషన్ సహా ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. పామ్ ఆయిల్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది.
8/ 9
పామ్ ఆయిల్ జనవరి డెలివరీ రేటును గమనిస్తే.. ఇది ఏకంగా టన్నుకు 1010 డాలర్లకు చేరింది. అంటే ఇక్కడ ధర పైకి చేరిందని చెప్పుకోవచ్చు. 776 డాలర్ల నుంచి 1010 డాలర్లకు ఎగసింది. కాగా మార్చి నెలలో పామ్ ఆయిల్ దిగుమతి రేటు టన్నుకు 2010 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే.
9/ 9
అలాగే ఇండోనేసియా ఎగుమతులపై ఏమైనా ప్రతికూల నిర్ణయం తీసుకుంటే.. అప్పుడు ఆయిల్ రేట్లు మరింత పైకి చేరొచ్చు. ఇండోనేసియా జూలై నెలలో పామ్ ఆయిల్‌పై ఎగుమతి సుంకాలను తొలగించింది.