1. బుల్లెట్ బైక్... కుర్రకారు డ్రీమ్ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఎక్కి చక్కర్లు కొట్టాలని కుర్రాళ్లు కలలు కంటారు. అయితే బడ్జెట్ కారమంగా ఈ బైక్ అందరికీ అందుబాటులో ఉండదు. కాస్త ఎక్కువ సంపాదిస్తున్నవారు, డబ్బున్నవారు మాత్రమే ఈ బైక్ కొంటుంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) బైక్ కొనాలంటే లక్షన్నర పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. (image: Royal Enfield)
3. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఆన్‌రోడ్ ధర రూ.1,88,000 వరకు ఉంటుంది. కేవలం రూ.9,000 డౌన్‌పేమెంట్ చెల్లించి ఈఎంఐలో బుల్లెట్ బైక్ సొంతం చేసుకోవచ్చు. 60 నెలలు, 48 నెలలు, 36 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. 60 నెలల టెన్యూర్ ఎంచుకుంటే రూ.3,525 ఈఎంఐ, 48 నెలల టెన్యూర్ ఎంచుకుంటే రూ.4,131 ఈఎంఐ, 36 నెలల టెన్యూర్ ఎంచుకుంటే రూ.5,156 ఈఎంఐ చెల్లించాలి. (image: Royal Enfield)
4. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఫీచర్స్ చూస్తే ఇందులో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 346సీసీ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్‌లోని ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్ట్ టెక్నాలజీ గరిష్టంగా 28 Nm టార్క్, 19.36 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది. బైక్ బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్‌లు, వెనుక చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లతో పాటు సింగిల్ ఛానల్ ABS సిస్టమ్ కూడా ఉంది. (image: Royal Enfield)
6. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇటీవల సూపర్ మెటార్ 650 మోడల్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ మెటార్ 650, సూపర్ మెటార్ 650 టూరర్ మోడల్స్‌ని పరిచయం చేసింది. ఇందులో 648cc ట్విన్ ఇంజిన్ ఉంది. ఇది 47 bhp పవర్‌ను, 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 241 కిలోల బరువు ఉంటుంది. 15.7 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఉండటం విశేషం. ఆస్ట్రల్ బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ, ఆస్ట్రల్ గ్రీన్, ఇంటర్స్టెల్లార్ గ్రే, ఇంటర్స్టెల్లార్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Royal Enfield)