1. భారతీయ రైల్వే ప్రారంభిస్తున్న వందేభారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. ప్రయాణికుల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీంతో తమ ప్రాంతానికి వందే భారత్ రైలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు తమ ప్రాంతానికి వందే భారత్ రైలు కావాలని కోరుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతీయ రైల్వే 2019లో తొలి వందే భారత్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని పలు రూట్లల్లో 10 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 75 వందే భారత్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. కాబట్టి మరిన్ని రూట్లల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. న్యూఢిల్లీ- వారణాసి, న్యూఢిల్లీ- కాట్రా, గాంధీనగర్- ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ- అంబ్ అందౌర, చెన్నై- మైసూరు, బిలాస్పూర్-నాగ్‌పూర్, హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్, సికింద్రాబాద్-విశాఖపట్నం, ముంబై-సోలాపూర్, ముంబై-సాయినగర్ షిరిడీ రూట్లల్లో వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. తమ నియోజకవర్గానికి వందే భారత్ రైలు కావాలంటూ 60 మంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువగా బీజేపీ ఎంపీల నుంచే ఈ డిమాండ్లు వస్తున్నాయి. ధార్వాడ్ నుంచి బెంగళూరు రూట్లో వందే భారత్ రైలు కావాలని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ కోరుతుండగా, గ్వాలియర్‌కు ఈ రైలు కావాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కోరుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. డిమాండ్‌కు తగ్గట్టుగా వందే భారత్ రైళ్ల తయారీ జరుగుతోంది. రాబోయే రోజుల్లో వారానికి రెండుమూడు వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, హర్యానాలోని సోనిపత్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ, మహారాష్ట్రలోని లాథూర్‌లోని ఫ్యాక్టరీల్లో వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లోనే వందే భారత్ రైలు నడుస్తోంది. త్వరలో సికింద్రాబాద్-తిరుపతి రూట్లో వందే భారత్ రైలు ప్రారంభం కానుందన్న వార్తలొస్తున్నాయి. దీంతో పాటు సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె రూట్లల్లో కూడా వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)