1. మీకు రేషన్ కార్డు ఉందా? ప్రతీ నెల రేషన్ తీసుకుంటున్నారా? ఫిబ్రవరి 1 నుంచి రేషన్ తీసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాల్సిందే. తెలంగాణలోని మొదటిసారిగా ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫిబ్రవరి 1 నుంచి రేషన్ తీసుకోవాలంటే రేషన్ కార్డు హోల్డర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తేనే సరుకులు తీసుకోవడం సాధ్యమవుతుంది.
(ప్రతీకాత్మక చిత్రం)
3. Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఏటీఎం రూల్స్‌ను గుర్తుంచుకుని, పాటించాల్సి ఉంటుంది. ఏటీఎంల్లో నగదు బదిలీ చేసే క్రమంలో ఎన్నో మోసాలు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ లిమిట్‌ను నియంత్రిస్తోంది. పీఎన్బీ కస్టమర్లు నాన్ ఈఎంవీ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం సాధ్యం కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. Pensioners: పెన్షనర్లు ప్రతి ఏటా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ పత్రం)ను సమర్పించేందుకు తుది గడువు కూడా ఫిబ్రవరి నెలాఖరే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈమేరకు పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ఫిబ్రవరి 28, 2021ను డెడ్ లైన్ గా ప్రకటించిన నేపథ్యంలో మీరు సీనియర్ సిటిజన్ అయినా, మీ ఇంట్లో సీనియర్ సిటిజన్లు ఉన్నా వారి లైఫ్ సర్టిఫికేట్ ను పీఎఫ్ ఆఫీసులో ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
8. LPG Gas Cylinder: ఫిబ్రవరి 1న ఎల్పీజీ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి ఆయిల్ కంపెనీలు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరల్ని దృష్టిలో పెట్టుకొని ధరల్ని సవరిస్తూ ఉంటాయి. డిసెంబర్ నుంచి సిలిండర్ ధర రూ.100 పెరిగిన సంగతి తెలిసిందే. మరి ఈసారి సిలిండర్ ధర తగ్గుతుందో పెరుగుతుందో చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం)