1. పశ్చిమ కనుమల్లో వెలసిన భూతలస్వర్గం అయిన ఊటీకి వేసవిలో క్యూకడుతుంటారు పర్యాటకులు. ఊటీ అనగానే గుర్తొచ్చేది నీలగిరి పర్వతాలు మాత్రమే కాదు, ఆ నీలగిరి పర్వతాల మీదుగా వెళ్లే టాయ్ ట్రైన్ కూడా. ఊటీ టాయ్ ట్రైన్ (Ooty Toy Train) పేరుతో ఈ రైలు చాలా ఫేమస్. ఈ రైలుకు పర్యాటకుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. సదరన్ రైల్వే పరిధిలోని నీల్గిరి మౌంటైన్ రైల్వే (NMR) టాయ్ ట్రైన్స్ నడుపుతోంది. ప్రస్తుతం రెండు టాయ్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి మెట్టుపాళ్యం-ఊటీ, కూనూర్-ఊటీ రూట్లల్లో టాయ్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఈ రైళ్లల్లో టికెట్లు దొరకడం చాలా కష్టం. అందుకే చాలా ముందుగానే ఈ రైళ్లల్లో టికెట్స్ బుక్ చేస్తుంటారు పర్యాటకులు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఊటీ టాయ్ ట్రైన్ బుక్ చేయాలనుకునే పర్యాటకులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఊటీ రైల్వే స్టేషన్ పేరు ఉదగమండలం అని ఉంటుంది. కాబట్టి ఇదే పేరుతో సెర్చ్ చేసి రైలు టికెట్స్ బుక్ చేయాలి. ప్రస్తుతం ఒక టాయ్ ట్రైన్ మెట్టూపాళ్యం నుంచి ఊటీ వరకు ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 108 వంపులు, 16 టన్నెల్స్, 250 బ్రిడ్జీల గుండా ప్రయాణిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ రైలు ఉదయం 7.10 గంటలకు మెట్టూపాళ్యంలో బయల్దేరి ఉదయం 11.55 గంటలకు ఊటీ చేరుకుంటుంది. ఇదే రైలు మధ్యాహ్నం 2 గంటలకు ఊటీలో బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు మెట్టుపాళ్యం చేరుకుంటుంది. ఈ రైలు మెట్టూపాళ్యం-ఊటీ మధ్య నాలుగు గంటల పైనే జర్నీ ఉంటుంది. సెకండ్ సిట్టింగ్ టికెట్ ఛార్జీ రూ.295 కాగా, ఫస్ట్ క్లాస్ టికెట్ ఛార్జీ రూ.600. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఊటీ-కూనూర్ మధ్య ప్రతీ రోజూ నాలుగు టాయ్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ టాయ్ ట్రైన్ ఊటీ-కూనూర్ మధ్య కేవలం గంట 10 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. సెకండ్ సిట్టింగ్ టికెట్ ఛార్జీ రూ.150 కాగా, ఫస్ట్ క్లాస్ టికెట్ ఛార్జీ రూ.350. పర్యాటకులు ఎక్కువగా మెట్టుపాళ్యం నుంచి ఊటీ రూట్లోనే టాయ్ ట్రైన్ బుక్ చేయడానికి ఇష్టపడతారు. (ప్రతీకాత్మక చిత్రం)