1. బంగారం... భారతీయులకు ఆభరణాలు, ఆస్తి మాత్రమే కాదు. సెంటిమెంట్ కూడా. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనడాన్ని కూడా ఓ వేడుకలా భావిస్తారు. పండుగలు, ఇతర పర్వదినాల్లో బంగారం కొనడాన్ని అదృష్టంగా భావిస్తుంటారు. అందుకే అక్షయ తృతీయ, ధంతేరస్ లాంటి సందర్భాల్లో నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇటీవల కాలంలో ఇ-కామర్స్ పెరిగిపోవడంతో ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటుపడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారి కోసం ఆన్లైన్లోనే బంగారు ఆభరణాలు అమ్ముతుండటం సర్వసాధారణమైపోయింది. బంగారు నగలు మాత్రమే కాదు... 24 క్యారట్ గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్ కూడా ఇ-కామర్స్ సైట్లల్లో అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆన్లైన్లో బంగారు నగలు కొనడంలో లాభంతో పాటు నష్టం కూడా ఉంది. బంగారు ఆభరణాలపై అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఆన్లైన్లో నగలు కొనడం మంచిది. షాపులో కన్నా ఆన్లైన్లో మీరు చాలా వెరైటీలు చూడొచ్చు. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కొన్ని ఎంచుకొని, ఫైనలైజ్ చేయడానికి సమయం కూడా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆన్లైన్లో బంగారు ఆభరణాలు కొంటే అనేక పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ మాత్రమే కాదు నెట్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్ల ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. రిటర్న్, రీప్లేస్ పాలసీ కూడా ఉంటుంది. అంటే మీరు ఆర్డర్ చేసిన నగలు మీ చేతికి వచ్చాక నచ్చకపోతే వాటిని మార్చుకోవచ్చు. లేదా రిటర్న్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఆన్లైన్లో నగలు కొనడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో నగల్ని ఫోటోల్లో చూసి కొనాలి తప్ప ప్రత్యక్షంగా చూడలేరు. తీరా ఆర్డర్ చేశాక మీరు అనుకున్నట్టు నగలు లేకపోతే నిరాశ చెందాల్సిన పరిస్థితి వస్తుంది. అదే షాపులో అయితే మీరు నగల్ని చేతుల్లోకి తీసుకొని జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఆన్లైన్లో నగలు కొనేముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముందు మీరు చూసే సైట్ విశ్వసనీయతను చెక్ చేయాలి. ఇప్పటికే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ సైట్లను పోలినట్టు ఉండే నకిలీ సైట్లు అనేకం ఉన్నాయి. మీరు అధికారిక సైట్‌నే ఎంచుకోవాలి. నగలు ఆర్డర్ చేసే ముందు బంగారం స్వచ్ఛత గురించి తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)